టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు…!

November 8, 2019 at 1:24 pm

చిత్ర సీమ‌లో క‌ల‌క‌లం రేగింది. ఐటీ అధికారులు ఇటీవ‌ల కాలంలో సిని ప‌రిశ్ర‌మ‌లోని పెద్ద‌ల‌పై ఐటీ దాడులు చేస్తూ క‌ల‌కలం రేపుతున్నారు. ఐటీ అధికారులు సిని ప‌రిశ్ర‌మ‌లోని పెద్ద‌ల ఇండ్ల‌పై చేస్తున్న దాడుద‌ల‌తో ఇప్ప‌టికే సిని ప‌రిశ్ర‌మ‌లో భ‌యాందోళ‌న నెల‌కొనగా ఇప్పుడు మ‌రోసారి సిని ప‌రిశ్ర‌మ‌లోని ఓ ప్ర‌ముఖ నిర్మాత ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీ అధికారుల సోదాల‌తో సిని ప‌రిశ్ర‌మ‌లోని పెద్ద‌లు షాక్‌కు గుర‌వుతున్నారు..

ఐటీ అధికారులు ప్ర‌ముఖ నిర్మాత కే.ఎల్‌.నారాయ‌ణ ఇంటిలో దాడులు చేస్తున్నారు. ఈ నిర్మాత దుర్గా ఆర్ట్స్ సంస్థ‌ను స్థాపించి అనేక సినిమాను రూపొందించారు. సిని ప‌రిశ్ర‌మ‌లో ఓ పెద్ద బ్యాన‌ర్ కావ‌డంతో ఈ ఐటీ దాడుల‌పై తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిర్మాత కే.ఎల్‌.నారాయ‌ణ స్వ‌గ్రామైన కృష్ణాజిల్లా పెదగొన్నూర్ గ్రామంలోని ఆయ‌న నివాసంలో ఈ ఐటీ దాడులు జ‌రుగుతున్నాయి. హైద‌రాబాద్ నారాయ‌ణ ఉండ‌టంతో ఆయ‌న రాగానే శుక్ర‌వారం నాడు సోదాలు చేయ‌నున్నారు.

అయితే ఇంట్లో ఉన్న రెండు బీరువాల‌ను తెర‌వ‌కుండానే మిగ‌తా వాటిని సోదా చేశారు. స్వ‌గ్రామంలోని ఆయ‌న నివాసంతో పాటుగా, హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ లోని ఆయ‌న కార్యాల‌యాలు, నివాసాల్లో సోదా చేసిన‌ట్లు స‌మాచారం. ఈ సోదాలు ఐటీ అసిస్టెంట్ క‌మిష‌నర్ ఎం.శ్వేత ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్నారు. కాగా నిర్మాత‌గా నారాయ‌ణ ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మించారు. ఇందులో ప్ర‌ధానంగా హ‌లో బ్ర‌ద‌ర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సంతోషం, రాఖీ, దొంగాట‌, క్ష‌ణ‌క్ష‌ణంతో పాలు ప‌లు చిత్రాల‌ను నిర్మించారు. ఈరోజు త‌నీఖీలు అయిపోతే గానీ నారాయ‌ణ ప‌రిస్థితి ఏమితో తెలియ‌దు.

టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts