వైసీపీ స‌ర్కారుకు బూస్ట్ కానున్న ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్‌

November 7, 2019 at 12:03 pm

నిరంతరం ప్ర‌జ‌ల‌కోసం త‌పించిన కోట‌గిరి విద్యాధ‌ర‌రావు వార‌సుడిగా రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసిన కోట‌గిరి శ్రీధ‌ర్‌.. త‌న తండ్రి ఆశ‌య సాధ‌న‌లో నిరంత‌రం ప్ర‌యాణిస్తున్నారు. తాను ఎక్క‌డ ఉన్నా.. ప్ర‌జ‌ల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసంఆయ‌న ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు. ఏలూరు నుంచి ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన శ్రీధ‌ర్ ఎంపీగా విజ‌యం సాధించారు. అయితే, విజ‌యం ఆయ‌న‌లో ఎక్క‌డా గ‌ర్వం పెంచ‌క‌పోగా.. మ‌రింత బాధ్య‌త‌ను పెంచింది. ఎంపీగా త‌న క‌ర్త‌వ్యాన్నినిత్యం గుర్తు చేసుకునే శ్రీధ‌ర్‌.. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. స‌మాజంకోసం, త‌న నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌న్న‌తి కోసం ప్లాస్టిక్‌పై యుద్ధాన్ని ప్ర‌క‌టించి, తాను పాటిస్తూ.. అంద‌రూ పాటించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అదే స‌మ‌యంలో త‌న‌కు ఉన్న ప‌రిచ‌యాల‌ను వినియోగించి రాష్ట్రానికి కూడా ఆర్థికంగా ఊపు తెచ్చేందుకు శ్రీధ‌ర్ ప్ర‌య‌త్నిస్తు న్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించిన ఆయ‌న అమెరికాలో త‌న‌కు ఉన్న విస్తృత ప‌రిచ‌యాలు వాడుతూ అమెరికా నుంచి పెట్టుబ‌డులు రాబ‌ట్టేలా ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. తాజాగా ఎంపీ శ్రీధ‌ర్ అమెరికాలో ప‌ర్య‌టించారు. ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్‌తో క‌లిసి ఎంపీ శ్రీధ‌ర్ అమెరికాలోని ప‌లు కీల‌క సంస్థ‌ల‌ను క‌లిసి ఏపీలో పెట్టుబ‌డులకు ఉన్న స‌ద‌వ‌కాశాల‌ను వివ‌రించారు. పెట్టుబ‌డుల స్వ‌ర్గ‌ధామం ఏపీలో పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా క‌లిగే లాభాల‌ను కూడా వారికి వివ‌రించారు. ఏయూఎస్ఐబి (ది ఎలైన్స్ ఫర్ యూఎస్ ఇండియా బిజినెస్)ని క‌లిసి ఏపీ గురించి వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఎంపీ శ్రీధ‌ర్ మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలు, సాంకేతిక రంగం, రక్షణ రంగం, స్మార్ట్ సిటీల అభివృద్ధికి రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను ఉద్ఘాటించారు. విజయవాడ, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని తెలిపారు. పెట్టుబడి ప్రాధాన్యతలైన వ్యవసాయం, మత్స్యకార, స్మార్ట్ సిటీస్, ఆరోగ్యభద్రత, పునరుత్పాదక ఇంధన రంగాల గురించి వాటిలో పెట్టుబడి అవకాశాల గురించి వివరించారు. దీనికి స్పందించిన ఏయూఎస్ఐబి వ్యవస్థాపక అధ్యక్షుడు సంజయ్ పూరి మాట్లాడుతూ.. వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఏపీలో గొప్ప అవకాశాలున్నాయన్నారు.

అమెరికా వ్యాపారస్తులు, పెట్టుబడిదారులతో సరైన భాగస్వామ్యం ఏపీని ప్రపంచ పటంలో వ్యాపార రంగంలో ఉన్నత స్థాయిలో నిలబెడుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం ఏయూఎస్ఐబి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్ర వ్యాపార నేతలతో మరింత దగ్గరగా పనిచేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. మొత్తంగా ఈ ప‌రిణామం చూస్తే.. ఎంపీ శ్రీధ‌ర్ త‌నంత‌ట తానుగా ఇన్షియేట్ తీసుకుని రాష్ట్రానికి పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నం ఫ‌లించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇదే జ‌రిగితే.. శ్రీధ‌ర్ పేరు రాష్ట్ర చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోనుంది.

వైసీపీ స‌ర్కారుకు బూస్ట్ కానున్న ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts