మ‌హేష్‌తో పోటీ… వెన‌క్కు త‌గ్గిన బ‌న్నీ..

November 8, 2019 at 12:55 pm

టాలీవుడ్‌లో ఇద్దరు స్టార్ హీరోల మధ్య నెలకొన్న పోటీ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. వ‌చ్చే సంక్రాంతికి మ‌హేష్‌బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు, బ‌న్నీ అల వైకుంఠ‌పురంలో సినిమాలు రెండూ ఒకే రోజు అంటే జ‌న‌వ‌రి 12న వ‌స్తున్న‌ట్టు పోటాపోటీగా పోస్ట‌ర్ల‌తో రిలీజ్ డేట్లు ప్ర‌క‌టించుకున్నారు. ఈ ఇద్ద‌రు పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు పోటీపోటీగా రిలీజ్ డేట్లు ఎనౌన్స్ చేసుకోవ‌డంతో అటు ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ ఈ రెండు సినిమాల పోటీపై పెద్దఎత్తున చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

తాజా అప్‌డేట్ ప్ర‌కారం త్రివిక్రమ్ టీమ్ ఓ హింట్ ఇచ్చింది. అల.. వైకుంఠపురములో సినిమాను మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాకు పోటీగా రిలీజ్ చేయ‌ర‌ని తెలుస్తోంది. అనేక మ‌ల్ల‌గుల్లాలు ప‌డ్డాక త్రివిక్ర‌మ్ సినిమాను మ‌హేష్ సినిమా వ‌చ్చాక రెండు రోజుల త‌ర్వాత రిలీజ్ చేసే అంశంపై ఆలోచ‌న చేస్తున్నార‌ట‌. సోలోగా వ‌స్తే ఒకటి రెండు రోజులు అయినా భారీ వ‌సూళ్లు ద‌క్కుతాయ‌న్న‌దే ఈ సినిమా మేక‌ర్స్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది.

తాజాగా అల వైకుంఠ‌పురంలో సినిమా నుంచి నుంచి కొత్తపోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ లుక్ ఆకట్టుకుంటోంది. కానీ ఇప్పటికే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయబడిన అల.. వైకుంఠపురములో రిలీజ్ డేట్ ఇందులో ముద్రించక పోవడంతో ఈ సినిమాను జ‌న‌వ‌రి 14న రిలీజ్ చేస్తార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. అయితే మ‌ళ‌యాళం పోస్ట‌ర్ ముందుగా రిలీజ్ చేయ‌గా అందులో డేట్ ఉంది.. ఆ త‌ర్వాత తెలుగు వెర్ష‌న్‌లో మాత్రం డేట్ వేయ‌లేదు. దీంతో మ‌హేష్ సినిమా వ‌చ్చాకే అల వైకుంఠ‌పురంలో వ‌స్తుంద‌ని అంటున్నారు.

మ‌హేష్‌తో పోటీ… వెన‌క్కు త‌గ్గిన బ‌న్నీ..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts