పెళ్లికాని ఆడ‌పిల్ల‌లే మావోయిస్ట్‌ పార్టీ టార్గెట్‌… సంచ‌ల‌న నిజాలు..!

November 8, 2019 at 3:47 pm

కొన్ని ద‌శాబ్దాలుగా మ‌న‌దేశంలో ప్ర‌భుత్వాల‌కు కంటిమీద కునుకు లేకుండా చేసిన మావోయిస్టులు క్ర‌మ‌క్ర‌మంగా క‌నుమ‌రుగు అవుతున్నారు. ప్ర‌స్తుతం మావోయిస్టు ఉద్య‌మంలో చేరేందుకు..కేవ‌లం అడ‌వుల్లో మాత్ర‌మే ఉండేందుకు ఈ త‌రం యువ‌త ఎక్కువుగా ఇష్ట‌ప‌డ‌క పోవడంతో మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు క్రమంగా బలహీనపడుతు వస్తుంది. క్షేత్ర స్థాయిలో ఆ పార్టీకి పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా కనపడటం లేదు.

ఏదేమైనా మావోయిస్టు ద‌ళాల్లోకి వెళుతోన్న వారి సంఖ్య క్ర‌మ‌క్ర‌మంగా తగ్గుతోంది. ప్ర‌స్తుతం యువ‌త అంతా స్మార్ట్ ఫోన్ ప్ర‌పంచంలో మునిగి తేలుతోంది. వారి కోరిక‌లు, ఆశ‌లు, ల‌క్ష్యాలు మారుతున్నాయి. దీంతో మావోయిస్టు పార్టీకి యువ‌త‌ను ఆక‌ర్షించ‌డం పెద్ద స‌వాల్‌గా మారింది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు అక్ర రిక్రూట్ మెంట్ అనేది ఆగిపోయింది.

తాజాగా మావోయిస్టు పార్టీ గురించి వెల్ల‌డైన నివేదిక‌లు ప‌లు షాకింగ్ అంశాలు చెపుతున్నాయి. ముక్కు ప‌చ్చ‌లార‌ని అడ‌పిల్ల‌లే టార్గెట్‌గా మావోయిస్టులు స‌రికొత్త రిక్రూట్‌మెంట్ చేస్తున్నార‌ట‌. 14-18 ఏళ్ల పిల్లలు. అడవి తప్ప సమాజం గురించి అవగాహన లేని వాళ్ల‌ను బ‌ల‌వంతంగా రిక్రూట్‌మెంట్ చేసుకుని… వాళ్ల‌ను స‌మాజానికి దూరంగా అడ‌వుల్లోకి తీసుకువెళ్లి మ‌రీ మావో ఉద్య‌మం నూరిపోస్తున్నార‌ట‌.

ఈ క్ర‌మంలోనే అక్క‌డ వాళ్లే పెళ్లి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసేస్తున్నార‌ట‌. దీంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో వాళ్లు చిన్న వ‌య‌స్సులోనే పెళ్లి చేసుకుని ఆ ప్ర‌భావం నుంచి బ‌య‌ట‌కు రాని ప‌రిస్థితులు క‌ల్పిస్తున్నారు. ఏదైనా దాడుల కోసం ఆడపిల్లలు అయితే చురుకుగా ఉంటారని వారిని ఎక్కువగా ఉద్యమంలోకి మావోయిస్ట్ పార్టీ తీసుకుంటుందని సర్వే పేర్కొంది.

మ‌న‌దేశంలో ఛ‌త్తీస్‌ఘ‌డ్‌, మ‌హారాష్ట్ర‌, తెలంగాణ‌లోని కొన్ని జిల్లాల‌కు చెందిన బాలిక‌ల‌నే వారు టార్గెట్‌గా చేసుకుని ఈ ఊబిలోకి దింపుతున్నారు. దీంతో వారు జీవితాంతం అక్క‌డ ఉండిపోక త‌ప్ప‌డం లేదంటున్నారు. వీరిలో కొంద‌రు మాత్ర‌మే త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా… అది కూడా భ‌యం భ‌యంగానే తిరిగి జ‌న‌జీవన స్ర‌వంతిలోకి వ‌స్తున్నారు.

పెళ్లికాని ఆడ‌పిల్ల‌లే మావోయిస్ట్‌ పార్టీ టార్గెట్‌… సంచ‌ల‌న నిజాలు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts