*మీకు మాత్ర‌మే చెప్తా* రివ్యూ&రేటింగ్

November 1, 2019 at 11:11 am

టైటిల్ : మీకు మాత్రమే చెప్తా
బ్యానర్ : కింగ్ అఫ్ ది హిల్
నటీనటులు : తరుణ్ భాస్కర్, వాణి భోజన్, అభినవ్ గోమఠం , అనసూయ
సంగీతం :శివ కుమార్
నిర్మాత : విజయ్ దేవరకొండ
దర్శకత్వం : షామీర్ సుల్తాన్

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా అవ‌తార‌మెత్తి నిర్మిస్తున్న మొట్ట‌మొద‌టి సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’. పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్, వాణి భోజన్, అభినవ్ గోమఠం కీల‌క‌ పాత్రల్లో న‌టించారు. ఇక ఈ సినిమాకు నూతన దర్శకుదు షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వం వహించారు. అయితే.. ఈ క్రేజీ కాంబోలో వ‌స్తున్న సినిమా కావ‌డంతో మొద‌టి నుంచీ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి నెల‌కొంది. ద‌ర్శ‌కుడు హీరోగా.. హీరో నిర్మాత‌గా వ‌స్తున్న వినూత్న ప్ర‌యోగం కావ‌డంతో సినీవ‌ర్గాల్లో ఆస‌క్తినెల‌కొంది. ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. అయితే.. ఈసినిమా ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకుందా..? వినూత్న ప్రయోగం స‌క్సెస్ అయ్యిందో.. కాలేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

కథేమిటంటే…
ఇక క‌థ‌లోకి వెళ్దాం.. రాకేశ్‌ (తరుణ్ భాస్కర్) తన ప్రేయసి శాంతిని (వాణి భోజన్)ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుంటాడు. ఈక్ర‌మంలో అతని ఫోన్ కి ఓ వీడియో వస్తోంది. ఆ వీడియో రాకేశ్ కు సంబంధించిన సీక్రెట్‌ వీడియో. అయితే.. ఆ వీడియోక‌నుక బ‌య‌ట‌కు వ‌స్తే.. ఇక త‌న పెళ్లి ఎక్క‌డ ఆగిపోతుందోన‌ని భ‌య‌ప‌డిన రాకేశ్‌.. దానిని ఆప‌డానికి నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. శాంతికి తెలియ‌కుండా ఉంచ‌డానికి స్నేహితుల‌తో క‌లిసి ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. ఆ వీడియోను వైర‌ల్ కాకుండా ఆప‌గ‌లిగారా..? ఆస‌లు ఆ వీడియోను ఎవ‌రు పంపారు..? ఎందుకు పంపారు.. దీని వెనుక ఎవ‌రున్నారు.. చివ‌రికి ఏం జ‌రిగింది..? త‌దిత‌ర ఇంట్రెస్టింగ్ విష‌యాలు తెలుసుకోవాలంటే మాత్రం తెర‌పై చూడాల్సిందే మ‌రి.

ఎలా ఉందంటే..
ఈ సినిమాను ద‌ర్శ‌కుడు తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగా తెర‌పై చూపించ‌డంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పొచ్చు. చాలా కామెడీగా క‌థ ముందుకు సాగుతుంది. అయితే.. అక్క‌డ‌క్క‌డ స్లోగా ఉన్నా.. పెద్ద‌గా బోర్ అనిపించ‌దు. ఇక కొన్నికొన్ని సీన్లు మాత్రం ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తాయి. తరుణ్ భాస్కర్ కి సంబంధించిన వీడియో బయట పడ్డ దగ్గరనుంచీ స్క్రీన్ ప్లే ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. తరుణ్ భాస్కర్, అతని ఫ్రెండ్స్ మరియు మిగిలిన కీలక పాత్రలకు మధ్య వచ్చే కామెడీ సీన్లు బాగా న‌వ్విస్తాయి. ఇలా సినిమా మొత్తం ప‌లు ఇంట్రెస్టింగ్ మలుపుల‌తో ముందుకు సాగుతుంది. అనసూయ రోల్ కి సంబంధించిన ట్విస్ట్ మరియు అదేవిధంగా ఆ వీడియోకి సంబంధించిన ట్విస్ట్ సూప‌ర్బ్ అని చెప్పొచ్చు.

ఎవ‌రెలా చేశారంటే..
ఈ సినిమాలో త‌రుణ్‌భాస్క‌ర్ న‌ట‌న సూప‌ర్బ్ అని చెప్పొచ్చు. ఎక్క‌డ కూడా త‌డ‌బాటు లేకుండా ఆయ‌న న‌టించిన తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. హీరోయిన్ వాణి భోజ‌న్‌ కూడా త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేసింద‌ని చెప్పొచ్చు. ఇక అన‌సూయ కూడా త‌న పాత్ర‌తో సినిమాకు మ‌రింత బలాన్ని ఇచ్చింది. మొత్తంగా త‌రుణ్‌, అభిన‌వ్‌, అన‌సూయ త‌మ న‌ట‌న‌తో బాగా ఆక‌ట్టుకున్నారు. మొత్తంగా వినూత్నంగా చేసిన ప్ర‌యోగం చాలావ‌ర‌కు స‌క్సెస్ అయ్యింద‌నే చెప్పొచ్చు. నిర్మాత‌గా అవ‌తార‌మెత్తిన హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మొద‌టిసారే మంచి విజ‌యాన్ని అందుకున్నాడు.

రేటింగ్: 2.75/5

*మీకు మాత్ర‌మే చెప్తా* రివ్యూ&రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts