ముంబైలో మాయమవుతోన్న అమ్మాయిలు… ఏం జ‌రుగుతోందంటే…!

November 20, 2019 at 1:34 pm

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రతిరోజు కొన్ని లక్షల కోట్ల బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఇదంతా పైకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ముంబైలో ఎవరికీ కనిపించని క్రైమ్ కూడా ఎక్కువగా ఉంటోందని తాజా లెక్కలు చెబుతున్నాయి. ముంబై నగరంలో ఎవరి బిజీ జీవితంలో వారు ఉంటారు… పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకునే పరిస్థితి వారికి ఉండదు. ఈ క్రమంలోనే ముంబై మాఫియా ముఠాలు చాలా సైలెంట్‌గా తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. ముంబై గురించి తాజాగా బయటకు వచ్చిన విషయం ఇప్పుడు మహిళలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

ప్రతి రోజు ముంబైలో సగటున నలుగురు అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు. 15 నుంచి 20 – 22 సంవత్సరాల మధ్యలో ఉన్న యువతులు ఎక్కువగా మాయం అవుతుండ.. వీరిలో 15 – 18 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలు ఎక్కువగా అపహరణకు గురవుతోండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ యేడాది జ‌న‌వ‌రి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 10 నెల‌ల్లోనే ఏకంగా 1141 మైనర్ బాలికలు అపహరణకు గురైనట్లు వివిధ పోలీసు స్టేషన్ల లో కేసులు నమోదయ్యాయి.

ఈ కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతుండ‌డంతో పోలీసులు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ఇప్ప‌టి వ‌ర‌కు 912 కేసులని పోలీసులు ఛేదించారు. ఈ కేసుల‌ విచారణ లో పెళ్లి పేరట మోసపోయిన కేసులే అధికంగా వెలుగులోకి వస్తున్నాయి. కొంద‌రు బ్రోక‌ర్లు అమ్మాయిల‌ను ఎట్రాక్ట్ చేసి పెళ్లి పేరుతో ప్రేమ ముగ్గులోకి దింపి అవ‌స‌రాలు తీర్చుకుంటున్నారు. ఆ త‌ర్వాత వారిని ట్రాప్ చేసి వ్య‌భిచార ముఠాల‌కు అమ్మేయ‌డ‌మో ? లేదా ? వ‌దిలించు కోవ‌డ‌మో ? చేస్తున్నారు.

ఇలా అప‌ర‌హ‌ర‌ణ‌కు గుర‌వుతోన్న అమ్మాయిల త‌ల్లిదండ్రుల్లో చాలా మంది ప‌రువు పోతుంద‌ని ఫిర్యాదు చేసేందుకు కూడా ముందుకు రాడం లేదు. మోసపోయిన వారిలో అధికంగా కాలేజీల కు వెళ్లే బాలికలే ఉన్నారు. మ‌రి కొంద‌రు అమ్మాయిలు అబ్బాయిల‌ను న‌మ్మి రేప్‌కు గురైన వాళ్లు కూడా ఎక్కువ‌గానే ఉంటున్నార‌ని తేలింది.

ముంబైలో మాయమవుతోన్న అమ్మాయిలు… ఏం జ‌రుగుతోందంటే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts