మైత్రీకి భారంగా మారిన‌ మెగా హీరో…!

November 16, 2019 at 2:42 pm

మైత్రీ మూవీ మేక‌ర్స్.. ఈ సంస్థ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ నిర్మాణ సంస్థ‌గా వెలుగొందుతుంది. ఈ సంస్థ ప్రారంభంలోనే మూడు భారీ ప్రాజెక్టులు చేప‌ట్టి భారీ విజ‌యాలు అందుకుని భారీ లాభాలు ఆర్ఙించింది. అయితే త‌రువాత ఈ ప్రాజెక్టు భారీ ప్రాజెక్టుల‌తో మీడియం రేంజ్ ప్రాజెక్టుల‌ను చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ భారీ సంస్థ‌కు వ‌రుస‌గా వ‌స్తున్న మీడియం రేంజ్ ప్రాజెక్టులతో న‌ష్టాలు వ‌చ్చి ప‌డుతున్నాయి. దీంతో ఇప్పుడు ఏమీ చేయాలో తెలియ‌ని అయోమ‌య స్థితిలోకి చేరింది.

అయితే మైత్రీ మూవీ మేక‌ర్స్ చేస్తున్న సినిమాలు లాభాల‌తో పాటుగా కొన్ని సినిమాలు న‌ష్టాల‌ను తెస్తున్నాయి. దీంతో ప్ర‌స్తుతం చేయ‌బోతున్న చిత్రాల‌పై ఆ ప్ర‌భావం ప‌డుతుంది. అందులో మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఓ మెగా హీరో చిత్రంతో నానా తంటాలు పడుతుంద‌ని టాక్‌. ఇంత‌కు మెగా హీరోల‌తో వ‌రుస సినిమాలు చేస్తున్న ఈసంస్థ ఏ హీరోతో ఎందుకు ఇబ్బందులు ప‌డుతుందో ఓసారి చూద్దాం.

మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు పంజా వైష్ణ‌వ్ తేజ్. వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప్ర‌స్తుతం ఉప్పెన సినిమా తెర‌కెక్కుతుంది. ఈసినిమా ప్ర‌స్తుతం చివ‌రి ద‌శ‌లో ఉంది. అయితే ముందుగా అనుకున్న బ‌డ్జెట్ కాకుండా ఇప్పుడు త‌డిసి మోపెడు అవుతుంద‌ని టాక్‌. మీడియం చిత్రంగా అనుకుంటే పెద్ద బ‌డ్జెట్ చిత్రంగా మారిపోయింద‌ని సంస్థ త‌ల‌ప‌ట్టుకుంద‌నే టాక్ వినిపిస్తుంది. ఈసినిమా పై ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్న సంస్థ‌కు బ‌డ్జెట్ విష‌యంలో చుక్క‌లు క‌నిపిస్తున్నాయని చిత్ర యూనిట్ అభిప్రాయ ప‌డుతుంది.

ఉప్పెన చిత్రం త్వ‌రలో విడుద‌ల కానున్న నేప‌థ్యంలో అస‌లు సినిమా నిర్మాత‌ను కాపాడుతుందా.. నిలువునా ముంచుతుందా అనే ఆందోళ‌న నెల‌కొన్న‌ది. నిర్మాణ సంస్థ ప్ర‌స్తుతం త్వ‌ర‌లో చేప‌ట్ట‌బోతున్న అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కే చిత్రంపైనే ఆశ‌లు పెట్టుకుంద‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన మీడియం రేంజ్ చిత్రాలు అయిన స‌వ్య‌సాచి, అమ‌ర్ అక్బ‌ర్ అంటోని చిత్రాలు భారీ డిజాస్ట‌ర్‌తో భారీగా సంస్థ న‌ష్ట‌పోయింద‌ని ఇక ఉప్పెన సినిమాతో ఉప‌కార‌మో అప‌కార‌మో తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితి ఉంది. ఏదేమైనా ఈ మెగా హీరో సినిమా విడుద‌ల అయితే త‌ప్ప సంస్థ భ‌విత‌వ్యం ఏమిటో తెలిసేలా లేదు.

మైత్రీకి భారంగా మారిన‌ మెగా హీరో…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts