కల్యాణ్‌ రామ్ ‘ఎంత‌మంచివాడ‌వురా’ రిలీజ్ డేట్ ఖరారు

November 8, 2019 at 12:36 pm

టాలీవుడ్ హీరో నందమూరి కల్యాణ్‌ రామ్ ఎంత మంచివాడవురా! నటిస్తున్న చిత్రం. ఈ చిత్రం ఎన్న‌డు రాబోతున్నాడ‌నే టెన్స‌న్‌కు ముగింపు ప‌లికాడు హీరో క‌ళ్యాణ్‌రామ్‌. ఎంత‌మంచివాడ‌వురా తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు అనే సందిగ్థ‌త‌కు తెరదించారు హీరో. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేసిన‌ట్టు సోష‌ల్ మీడియా వేధిక‌గా ప్ర‌క‌టించారు. ఈ సినిమాకు జ‌న‌వ‌రి 15న విడుద‌ల చేస్తున్న‌ట్లు హీరో క‌ళ్యాణ్ రామ్ వెల్ల‌డించారు.

ఎంత‌మంచివాడ‌వురా సినిమాకు సతీష్ వేగేష్న దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంది. ఈ చిత్రం టీజర్‌తో పాటు సంక్రాంతికి వస్తున్నట్టుగా ఇంట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచుకున్న క‌ళ్యాణ్ రామ్ సంక్రాంతి బ‌రిలో నిలిచారు. ఇంత‌కు ముందు ఈ సినిమా సంక్రాంతి వ‌స్తుంద‌ని తెలిసిన‌ప్ప‌టికి ఏ తేదీన అనేది ప్ర‌క‌టించ‌లేదు. ఇప్పుడు ఈ తేదిని ప్ర‌క‌టించి సస్పెన్స్‌కు తెర‌దించారు.

ఎంత మంచివాడవురా ఆదిత్య మ్యూజిక్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో వస్తున్న ఈ మూవీని ఉమేష్ గుప్త, సుభాష్‌ గుప్త నిర్మిస్తుండగా.. కల్యాణ్‌ రామ్ సరసన మెహ్రీన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. గోపి సుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ సినిమాతో నైనా క‌ళ్యాణ్ రామ్ కేరీర్‌లో హిట్ చిత్రంగా నిలుస్తుందో లేదో చూడాలి మ‌రి. అస‌లే సంక్రాంతి పోటీ భారీగా ఉన్న నేప‌థ్యంలో క‌ళ్యాణ్ రామ్ చేస్తున్న సాహసం ఎంత‌మేర‌కు ఫ‌లిస్తుందో మ‌రి.

కల్యాణ్‌ రామ్ ‘ఎంత‌మంచివాడ‌వురా’ రిలీజ్ డేట్ ఖరారు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts