ఒక్క హిట్ వ‌చ్చిందో లేదో రేటు పెంచేసిన టాలీవుడ్ హీరోయిన్!

November 8, 2019 at 1:05 pm

ఒకప్పుడు హీరోయిన్ లు అంటే దశాబ్దాల తరబడి సినిమాల్లో నటిస్తూనే వారు. అయితే ఇటీవ‌ల హీరోయిన్ల‌కు లాంగ్ జ‌ర్నీ ఉండ‌డం లేదు. అనుష్క‌, న‌య‌న‌తార లాంటి ఒక‌రిద్ద‌రు హీరోయిన్ల‌కు మిన‌హాయిస్తే మిగిలిన హీరోయిన్లు వ‌స్తున్నారు ఏడెనిమిది సినిమాలు చేస్తున్నారు.. జెండా ఎత్తేస్తున్నారు. గ్లామ‌ర్ ఉన్న‌ప్పుడు, అవ‌కాశాలు వ‌స్తున్న‌ప్పుడు.. హిట్లు వ‌చ్చిన‌ప్పుడే పిండుకోవాల‌ని చూస్తున్నారు.

ఈ లిస్టులోకే చేరిపోయింది అందాల నిధి అగ‌ర్వాల్‌. అంత‌కు ముందు రెండు మూడు సినిమాలు చేసినా అవేవి ఆమెకు క‌లిసి రాలేదు. తాజాగా పూరి జ‌గ‌న్నాథ్ – రామ్ కాంబినేష‌న్లో వ‌చ్చిన ఇస్మార్ట్‌శంక‌ర్ హిట్ అవ్వ‌డంతో ఆమెకు ఒక‌టి రెండు అవ‌కాశాలు వ‌చ్చాయి. అంతే ఆమె వెంట‌నే ఇస్మార్ట్‌శంక‌ర్ సినిమా చూపించి రేటు పెంచేసింది. సూప‌ర్‌స్టార్‌ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ పరిచయమవుతున్నారు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించనున్న ఈ సినిమాలో నిధి హీరోయిన్ గా నటించనుంది.

ఈ సినిమాలో ఈమెకు పారితోషికం కోటి రూపాయలు అందుకుంటుందట. గతంలో అగ్ర కథానాయికలు కూడా మూడు సినిమాలు వరకు చేస్తే గాని కోటి రూపాయలు పారితోషికం వచ్చేది కాదు కానీ ఈ ఒక్క సినిమా హిట్ కావడంతో ఇండస్ట్రీ వర్గాలు ఔరా అంటున్నాయి. మొత్తానికి నిధి దీపం ఉండ‌గానే బాగానే ఇళ్లు చ‌క్క‌పెట్టుకుంటోంద‌న్న మాట‌.

ఒక్క హిట్ వ‌చ్చిందో లేదో రేటు పెంచేసిన టాలీవుడ్ హీరోయిన్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts