చిరుపైనే ప‌వ‌న్ సెటైర్లు వేశాడే…!

November 6, 2019 at 11:50 am

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడ‌తాడో ? అన్న‌ది ఆయ‌న‌కే క్లారిటీ ఉన్న‌ట్టు లేదు. చంద్ర‌బాబు లాగానే ప‌వ‌న్ కూడా ప‌దే ప‌దే యూట‌ర్న్‌లు తీసుకోవ‌డం అల‌వాటు అయిపోయింది. తాజాగా జ‌న‌సేనాని విశాఖ వేదిక‌గా ఇసుక కొర‌త‌పై లాంగ్ మార్చ్‌కు పిలుపు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశంలో ప‌వ‌న్ ప్ర‌సంగంలో ఆత్మస్తుతి పరనిందే ఎక్కువగా కనిపించింది. తాను సినిమాల్లో ఉండి సైడ్ ఇన్‌క‌మ్‌ను ఎందుకు వ‌ద్ద‌నుకున్నానో ? కూడా చెప్పారు. ఇక ప్ర‌జ‌ల కోస‌మే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చి క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని చెప్పుకొచ్చారు.

తాను సినిమాల్లో ఉండి చంద్రబాబు గారూ నమస్తే, జగన్ గారూ నమస్తే అంటూ రాజకీయ నాయకులతో రాసుకుపూసుకు తిరిగితే ఇలాంటి ఇబ్బందులు ఉండేవే కావ‌ని… త‌న సినిమాల‌కు క‌లెక్ష‌న్లు పెంచుకునే ఉపాయం కూడా అదేన‌ని చెప్పారు. ఇక సినిమా వాళ్లు అధికారంలో ఉన్న నాయ‌కుల‌ను ఎందుకు క‌లుస్తారో ? కూడా ప‌వ‌న్ చెప్పారు. అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా ప‌వ‌న్ ప‌రోక్షంగా త‌న అన్న చిరుపైనే సెటైర్ వేసిన‌ట్ల‌య్యింది.

సొంత లాభం కోసమే సినీ హీరోలు రాజకీయ నాయకుల‌ను క‌లుస్తార‌ని ప‌వ‌న్ అన్నాడు. మ‌రి ఇటీవ‌ల చిరు సైరా సినిమా కోసం ఏపీ సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్రీమియ‌ర్ షోల కోసం ఏకంగా ఏపీ మంత్రి క‌న్న‌బాబు ద్వారా పెద్ద లాబీయింగే జ‌రిగింది. ఆ త‌ర్వాతే చిరు దంప‌తులు జ‌గ‌న్‌ను క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ ప‌వ‌న్ త‌న‌కు తాను గొప్పు చెప్పుకున్నా ప‌రోక్షంగా అన్న‌పైనే సెటైర్ వేశాడ‌న్న‌ది మాత్రం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఇక అన్న చిరు తన సినిమా కలెక్షన్ల కోసమే సీఎం జగన్ ను కలిశారని ప‌వ‌న్ బ‌య‌ట పెట్టిన‌ట్ల‌య్యింది. మ‌రి ఈ విష‌యంలో మెగాస్టార్ అభిమానులు ఎలా స్పందిస్తారో ? చూడాలి.

చిరుపైనే ప‌వ‌న్ సెటైర్లు వేశాడే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts