రాజమౌళి సపోర్ట్ చేస్తున్న చిన్న సినిమా..!

November 18, 2019 at 4:24 pm

టాలీవుడ్ లో ఓ చిన్న సినిమాను ప్రమోట్ చేస్తూ తన సలహాలు సూచనలు ఇస్తున్నాడత దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి సూచనలతో వస్తున్న సినిమా ఏది అంటే మత్తువదలరా. ఈ సినిమాలో హీరోగా మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి తనయుడు సింహా కోడూరి నటిస్తున్నాడు.

అంతేకాదు ఈ మూవీకి మ్యూజిక్ డైరక్టర్ గా కీరవాణి మరో తనయుడు కాల భైరవ పనిచేస్తున్నాడు. ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ సినిమాను రాజమౌళికి మాత్రమే చూపించారట. కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా వస్తున్న ఈ సినిమాకు రాజమౌళి చిన్న చిన్న మార్పులు సూచించాడట. రితేష్ రానా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను హేమలత నిర్మిస్తున్నారు.

మరి రాజమౌళి సూచనలు ఇస్తున్నాడు అంటే తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉంటుంది. సినిమాలో సింహా నటన చాలా బాగుటుందని అంటున్నారు. మ్యూజిక్ కూడా సినిమా కాన్సెప్ట్ కు దగ్గరగా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. మరి ఈ సినిమాతో కీరవాణి తనయుడు హీరోగా హిట్టు కొడతాడో లేదో చూడాలి.

రాజమౌళి సపోర్ట్ చేస్తున్న చిన్న సినిమా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts