వ‌ర్మ‌కు ఏపీ స‌ర్కారు షాక్‌..!

November 29, 2019 at 11:10 am

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌కు స‌మ‌స్య‌లు తీరేలా లేవు.. తాను ఏ మూహూర్తాన క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు సినిమా మొద‌లు పెట్టారు.. అప్ప‌టి నుంచి ద‌ర్శ‌కుడు వ‌ర్మ‌కు క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. రోజు రోజుకు ఈ సినిమాపై వివాదాలు ముసురుతున్నా.. వాటిని ఒక్కొక్క చిక్కుముడిని విప్పిన‌ట్లుగా విప్పుతున్న వ‌ర్మ‌.. ఇప్పుడు వ‌చ్చిన చిక్కుముడిని విప్ప‌డం అంతా ఈజీగా క‌నిపించ‌డం లేదు. ఇప్పుడు వ‌చ్చిన చిక్కుముడి చాలా పెద్ద‌ది కావ‌డంతో ఏమీ చేయాలో తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితిలో చిక్కుకున్నాడు వ‌ర్మ‌.

అయితే వ‌ర్మ‌కు వ‌స్తున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌ధానంగా కోర్టు కేసులే. అయితే క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు సినిమాపై మ‌త ప్ర‌భోధ‌కుడు కెఏ పాల్ కోర్టుకెక్కారు. ఈకేసు ఓ కొలిక్కి వ‌చ్చింది. ఈ కేసును వారం రోజుల లోపు ప‌రిష్క‌రించాల‌ని కోర్టు సెన్సార్ బోర్డుకు సూచించింది. ఇక సినిమా పేరుతో కులాల కుంప‌ట్లు పెట్టెలా ఉంద‌ని, అందుకే సినిమా పేరు మార్చాల‌ని అనేక వివాదాలు సాగుతున్నాయి.. వీట‌న్నింటిని భేఖాత‌రు చేస్తున్న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మకు ఇప్పుడు పెద్ద షాక్ త‌గిలింది.

ఆ షాక్ స్వ‌యంగా ఏపీ స‌ర్కారు నుంచి త‌గిలింది. క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు సినిమా టైటిల్ మార్చాల‌ని ఏపీ స‌ర్కారు స‌ల‌హాదారుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స్వ‌యంగా రీజ‌న‌ల్ సెన్సార్ బోర్డుకు లేఖ రాయ‌డం వ‌ర్మ‌ను క‌ల‌చి వేస్తుంది. వాస్త‌వానికి ఈ సినిమాతో ఎక్కువ‌గా లాభం ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అనేది ప్ర‌స్తుతం వినిపిస్తున్న మాట‌. అయితే స్వ‌యంగా జ‌గ‌న్ స‌ల‌హాదారుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సినిమా పేరు మార్చాల‌ని లేఖ రాయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. అంటే ఈ సినిమా పేరు మార‌డం ఖాయ‌మ‌నే వినిపిస్తుంది. ఈ స‌మ‌స్య నుంచి వ‌ర్మ గ‌ట్టెక్కుతాడా.. లేక సినిమా పేరు మార్పు చేసి విడుద‌ల చేస్తాడా వేచి చూడాలి.

వ‌ర్మ‌కు ఏపీ స‌ర్కారు షాక్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts