బూతు రాత‌ల‌పై టాలీవుడ్ న‌టీ ఫైర్‌…!

November 8, 2019 at 12:24 pm

సోష‌ల్ మీడియా వేధిక‌గా అస‌భ్య‌ప‌ద‌జాలంతో దూషిస్తూ వార్త‌లు రాసినందుకు ఓ టాలీవుడ్ న‌టి తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయ్యారు. అస‌లు అందాల బామ‌. వ‌రుస‌గా ఒకే హీరోతో రెండు సినిమాల్లో న‌టించింది. ఇంకేముంది అటు సోష‌ల్ మీడియాకు కోతికి కొబ్బ‌రి చిప్ప దొరికినంత ఆనందం అయింది. అంతే వెంట‌నే ఆ హీరోతో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపిస్తుంద‌ని వార్త‌లు రాయ‌డం, అది శృతిమించి బూతు ప‌దాలు రాయ‌డంతో ఆ హీరోయిన్ త‌ట్టుకోలేక పోయింది.. వెంట‌నే స్పందిస్తూ వాటిని ఖండిస్తూనే వారిపై ఫైర్ అయింది.

ఇంత‌కు ఈ బూతు రాత‌లు ఎవ్వ‌రిపైన రాసారు. దీనికి అంతలా ఫైర్ అయిన హీరోయిన్ ఎవ్వ‌రో తెలుసుకోవాల‌ని ఉందా.. అయితే చూడండి.. టాలీవుడ్ న‌టీ ర‌ష్మీక మందాన్న‌ను ఓ ట్రోల్ పేజీ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఎఫైర్ అంట‌గ‌డుతూ బూతు ప‌దాలు వాడుతూ, వ‌ల్గ‌ర్ భాష‌ను ఉప‌యోగించ‌డంతో అమెకు చిర్రెత్తుకొచ్చింది. ఈ ట్రోల్ పేజీ రష్మీక చిన్న‌నాటి ఫోటోల‌ను వాడుతూ ఇలా ఎఫైర్లు అంట‌గ‌డుతూ బూతు ప‌దాలు వాడ‌టంతో త‌ట్టుకోలేక పోయింది ర‌ష్మీక‌.

ర‌ష్మీక కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌క‌కు లింక్ చేసి వార్త‌లు రావ‌డంతో ఒళ్ళు మండిన ర‌ష్మీక జాలీ ద‌య లేకుండా ఇలాంటి పోస్టులు పెట్టి హార్ట్ చేయ‌డ‌మే ల‌క్ష్య‌మా అంటూ చివాట్లు పెట్టింది. ఎవ‌రు మ‌రొక‌రి ఫ్యామిలీని దూషించే హ‌క్కు లేద‌ని ప్ర‌స్తావించింది. అంతే కాదు ఇలాంటి పోస్టులు పెట్టిన వారు భ‌విష్య‌త్‌తో తీవ్ర ప‌రిణామ‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుందని హెచ్చ‌రించింది. పాపం ర‌ష్మీక‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఎఫైర్ రాసినందుకు బాధ కాదు కాబోలు.. అమెను బండ‌బూతులతో తిడుతూ వ‌ల్గ‌ర్ భాష ఉప‌యోగించ‌డంతో అమెకు ఒళ్లు మండింది కాబోలు.

బూతు రాత‌ల‌పై టాలీవుడ్ న‌టీ ఫైర్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts