
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఇప్పుడు జోడీ కోసం పాప దొరకకపోవడంతో అందరు సతమవుతున్నారు. ఎన్టీఆర్‌కు ఎందరు పాపలను చూసినా వారు ఎందుకో మద్యలోనే జారుకున్నారు. అయితే ఇప్పుడు మరో పాప కోసం వెతికినా దొరకకపోవడంతో చిత్ర యూనిట్ తల పట్టుకుంది. అయితే పాప కోసం ప్రాజెక్టును ఆపలేక ప్రత్యామ్నయ మార్గం ఎంచుకుంది చిత్ర యూనిట్. ఇంతకు ఎన్టీఆర్‌కు పాప దొరకకపోతే ప్రత్యామ్నయ మార్గం ఏంటన్నదే చర్చ.
ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ఇప్పుడు ఎన్టీఆర్‌కు సరిజోడి దొరకడం లేదు. అందుకే దర్శక ధీరుడు రాజమౌళీ ఓ ప్రత్యామ్నయ మార్గం చూసారు. ఆర్ ఆర్ ఆర్‌లో అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కు జోడీగా ఆలియాభట్ నటిస్తుంది. ఈ ఇద్దరి జోడీ తో వచ్చే సన్నివేశాలు వెంటనే పూర్తి చేసేందుకు రాత్రింభవళ్ళు షూటింగ్ జరుపుతున్నారు. అందుకు రాజమౌళీ చిత్రంలోని అనేక సీన్లను సాధ్యమైనంత మేరకు పూర్తి చేస్తున్నారు.
చిత్రం అనుకున్న టైంకు విడుదల చేయసేందుకు సన్నహాలు చేస్తూనే ఉన్నారు. అందుకు ముందుగా రామ్‌చరణ్‌తో వచ్చే సన్నివేశాలను, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో వచ్చే సన్నివేశాలను, ఫైటింగ్ సీన్లను, హీరోలతో సోలోగా వచ్చే సీన్లను షూటింగ్ జరుపుతున్నారు. చిత్రంలోని అన్ని సన్నివేశాలు పూర్తి అయిన తరువాత ఎన్టీఆర్ జోడీ తో కలిసి వచ్చే సన్నివేశాలను చివరిలో చిత్రీకరించాలని నిర్ణయించాకున్నారు. అందుకే ఎన్టీఆర్‌కు జోడీని వెతకడం మానేసిన చిత్ర దర్శకుడు రాజమౌళీ, చివరిగా ఎన్టీఆర్ జోడీని వెతికి సినిమాను పూర్తి చేస్తారు. అంటే సినిమా అనుకున్న సమయానికే విడుదల చేస్తారన్న మాట.