ప‌ది భాష‌ల్లో “ఆర్ఆర్ఆర్ ” విడుద‌ల‌..!

November 21, 2019 at 3:03 pm

ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆప్‌డేట్స్‌పై అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ మూవీపై ఓ సందిగ్ధం అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అంతే కాదు ఆర్ ఆర్ ఆర్ చిత్రంపై అభిమానులు ఉత్కంఠ‌తో ఎదురుచూస్తున్న సంఘ‌ట‌న‌లు ఎన్నో ఉన్నాయి… సినిమాపై అనేక అనుమానాలు అభిమానులు త‌ట్టిలేపుతున్నాయి. అసలు ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుద‌ల ఎప్పుడు అనేది ఓ ప‌ట్టానా అభిమానుల‌కు అంతుబ‌ట్ట‌కుండా ఉంది. అయితే దీనికి తోడు అనేక ప్ర‌శ్న‌లు త‌మ‌కు తామే వేసుకుంటూ స‌మాధానాలు త‌మ‌కు తామే చెప్ప‌కుంటూ సంబుర ప‌డుతున్నారు.. అంతే కాదు లోలోన మ‌ధ‌న ప‌డుతున్నారు…

అయితే జ‌క్క‌న్న ఉర‌ఫ్ ఎస్ ఎస్ రాజ‌మౌళీ తెర‌కెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై దేశంలోనే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది. అస‌లు జ‌క్క‌న్న చెక్కుతున్న ఈ శిల్పంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అందుకే అస‌లు ఆర్ ఆర్ ఆర్ చిత్రం విడుద‌ల ఎప్పుడు అనేది సందేహ‌స్ప‌దంగా మారిన నేప‌థ్యంలో ఇప్పుడు ఓ కొత్త విష‌యం అభిమానుల‌ను నిద్ర‌లేకుండా చేస్తున్నాయి.. చిత్ర యూనిట్ నిన్న ముగ్గురు కొత్త న‌టుల‌ను ప్ర‌క‌టించింది.

హాలీవుడ్‌కు చెందిన ఈ ముగ్గురిలో ఒక‌రు ఎన్టీఆర్‌కు జోడీ కాగా, ఒక‌రు మ‌గ విల‌న్‌, ఇంకొక‌రు ఆడ విల‌న్‌. అయితే ఈ విష‌యం ప్ర‌క‌టించిన సంద‌ర్భంలోనే మ‌రో ట్వీస్ట్ ఇచ్చింది చిత్ర యూనిట్‌. ఈ సినిమాను ప‌ది భాషల్లో తెర‌కెక్కిస్తున్న‌ట్లు హింట్ ఇచ్చింది. అయితే ద‌క్షిణ భార‌తంలోని తెలుగు, త‌మిళం, మ‌ళ‌యాళం, క‌న్న‌డ‌తో పాటు హింది అన్న‌ది అంద‌రికి తెలిసిందే. ఇక మిగిలిన ఐదు భాష‌లు ఏంటీవి అన్న‌ది ఇక్క‌డ స‌స్పెన్స్‌గా మారింది.

పాన్ ఇండియా సినిమా అంటే ప్రధానంగా ద‌క్షిణ భార‌తంలోని నాలుగు భాష‌ల‌కు తోడు హింది అని అర్థం. కానీ ఇప్పుడు మ‌రో ఐదు భాష‌లు అన‌డం అంటే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ప్ర‌పంచంలోని ప్ర‌ధాన భాష‌ల్లో కూడా ఒకేసారి విడుద‌ల చేస్తారా అన్న‌ది సందిగ్ధంగా మారింది. అయితే మ‌రో ఐదు భాష‌లు ఏంటంటే అని అభిమానులు ఇలా ఊహించుకుంటున్నారు.. ఒక‌టి చైనాలో ఇటీవ‌ల 2.0చిత్రం చైనా భాష‌లో విడుద‌ల అయింది. అంటే చైనా భాష ఒక‌టి కాగా, కొరియా, మ‌లేషియా, మొరాకో, జార్జీయా దేశాల్లోనూ అదే భాష‌ల్లో విడుద‌ల చేస్తారా అన్న‌ది స‌స్పెన్స్‌గా మారింది. ఇవే భాష‌లా లేక మ‌రే ప్రాంతీయ భాష‌లు ఉన్నాయా.. ప‌ది భాషలు ఏమిటీ అనేది జ‌క్క‌న్న చెప్పితే త‌ప్ప ఈ స‌స్పెన్స్‌కు తెర‌ప‌డేలా లేదు.. లేక ఇది సినిమాకు ప‌బ్లిసిటిలో భాగంగా చెప్పారా.. అన్న‌ది తేలాల్సి ఉంది.

ప‌ది భాష‌ల్లో “ఆర్ఆర్ఆర్ ” విడుద‌ల‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts