మ‌హేష్ అభిమానుల‌కు ఇక సరిలేరు టీజర్ …!

November 16, 2019 at 10:56 am

ప్రిన్స్ మ‌హేష్‌బాబు అభిమానుల‌కు శుభ‌వార్త తెలిపారు స‌రిలేరు నీకెవ్వ‌రు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. సంక్రాంతి బ‌రిలో ఉన్న స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా ప్ర‌మోష‌న్ కోసం ఇక గేట్లు తెరిచినట్లున్నారు. సినిమాకు సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మం నెమ్మ‌దిగా సాగుతుంద‌ని ఆందోళ‌న చెందుతున్న ప్రిన్స్ మ‌హేష్‌బాబు అభిమానుల‌కు ఇక ముందున్న రోజుల‌న్నీ పండుగే అని చెప్ప‌వచ్చు. స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్ర ప్ర‌మోష‌న్‌కు శ్రీ‌కారం చుట్టేందుకు రెడి అయ్యారు.

చిత్ర ప్ర‌మోష‌న్ లో భాగంగా చిత్ర యూనిట్ ఇప్ప‌టి వ‌ర‌కు ప్రిన్స్ మ‌హేష్‌బాబు, లేడీ అమితాబ్ విజ‌య‌శాంతిల ఫ‌స్ట్‌లుక్ ల‌ను విడుద‌ల చేశారు. ఇక ట్రైల‌ర్‌, టీజ‌ర్ వంటివి ఇంకా విడుద‌ల‌కు నోచుకోలేదు. అయితే ట్రైల‌ర్ విడుద‌ల చేసేందుకు సిద్ద‌మ‌వుతున్న‌ట్లు సంకేతాలు ఇచ్చిన చిత్ర ద‌ర్శ‌కుడు ముందుగా ఓ శాంపిల్‌గా ప్రిన్స్ మ‌హేష్‌బాబు ఓ షార్ట్ వెప‌న్ ప‌ట్టుకుని యుద్ధ‌భూమిలో ఉన్న షార్ట్‌సీన్‌ను విడుద‌ల చేశారు.

మేజ‌ర్ అజ‌య్ కృష్ణ గా న‌టిస్తున్న మ‌హేష్‌బాబు మిల‌ట్రీ దుస్తుల్లో షార్ట్ వెప‌న్ ఫైరింగ్‌కు రెడి చేసుకుంటు ముందుకు సాగుతున్న ఈ వీడియోను సోష‌ల్ మీడియా ట్వీట్ట‌ర్ అకౌంట్లో విడుదల చేశారు చిత్ర ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. టీజ‌ర్ లోడింగ్ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు. అంటే టీజ‌ర్ విడుద‌ల చేసి మ‌హేష్ అభిమానుల‌కు పండుగ వాతావ‌ర‌ణం నింపాల‌నే ఆలోచ‌న‌తో చిత్ర యూనిట్ ఉంద‌న్న మాట‌. సంక్రాంతి బ‌రిలో ఉన్న ఈసినిమాకు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన అల వైకుంఠ‌పురంలో సినిమా ప్రమోష‌న్ లో దూసుకుపోతుంది. దీంతో మ‌హేష్‌బాబు అభిమానులు నిరూత్సా ప‌డుతున్నారు. ఇప్పుడు టీజ‌ర్ విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ద‌మ‌వుతున్న త‌రుణంలో అభిమానుల ఆనందానికి ఆవ‌దులే ఉండ‌వు.

మ‌హేష్ అభిమానుల‌కు ఇక సరిలేరు టీజర్ …!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts