అయోధ్య‌పై సుప్రీం తీర్పులో అనుమానాలు…!

November 9, 2019 at 12:38 pm

దేశ‌వ్యాప్తంగా అంద‌రూ ఎన్నో సంవ‌త్స‌రాలుగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తోన్న అయోధ్య తీర్పును సుప్రీంకోర్టు శ‌నివారం వెల్ల‌డించింది. దీనిపై ఎవ‌రికి వారు త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ కేసుపై పిటిష‌న్ వేసిన సున్నీ వ‌క్ఫ్ బోర్డు సైతం త‌మ అభిప్రాయం తెలిపింది. అయోధ్య తీర్పు తమను నిరాశపర్చిందని సున్నీ వక్ఫ్ బోర్డు స్ప‌ష్టం చేసింది.అయితే సుప్రీంకోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని పేర్కొంది.

అయితే ఈ క్ర‌మంలోనే తమకు మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాలను కేటాయించాలని సుప్రీకోర్టు తీర్పు చెప్పిందని, తమకు ఐదు ఎకరాల స్థలం అక్కరలేదని సున్నీ వక్ఫ్ బోర్డు తెలిపింది. ఇక ఈ తీర్పుపై మ‌ళ్లీ రివ్యూ ఫిటిష‌న్ వేసే అవ‌కాశం కూడా లేద‌ని తెలుస్తోంది. అయితే సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయనిపుణులను సంప్రదిస్తున్నామని వ‌క్ఫ్ బోర్డ్‌ పేర్కొంది.

ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా తీర్పుపై స్పందించింది. సుప్రీంకోర్టు తీర్పులో తమకు కొన్ని అనుమానాలున్నాయని, మరోసారి పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టును అభ్యర్థిస్తామని ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలిపింది. అయోధ్య రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేసిన ముగ్గురు మధ్యవర్తుల బృందాన్ని సుప్రీంకోర్టు ప్రశంసించింది.

ఈ ముగ్గురు మ‌ధ్య‌వ‌ర్తులు అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి పరిష్కారానికి దగ్గరగా వచ్చారంటూ కితాబిచ్చింది. అయోధ్య వివాదంపై రాజీ కోసం జస్టిస్ కలీఫుల్లా, శ్రీరాం పంచు, శ్రీశ్రీ రవిశంకర్‌లను సుప్రీంకోర్టు మధ్యవర్తులుగా నియమించిన సంగతి తెలిసిందే.

అయోధ్య‌పై సుప్రీం తీర్పులో అనుమానాలు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts