మెగాస్టార్‌ను వెన‌క్కి నెట్టిన మెగా హీరో..!

November 21, 2019 at 4:15 pm

అవునా.. ఇది నిజ‌మేనా.. మెగాస్టార్ చిరంజీవిని మెగా హీరో వెన‌క్కి నెట్ట‌డమా.. ఇది క‌లా.. నిజమా… మెగాస్టార్ చిరంజీవినే వెన‌క్కి నెట్టెంత దమ్మున్న ఆ మెగా హీరో ఎవ‌ర‌బ్బా అనుకుంటున్నారా.. అవును మీరు విన్న‌ది నిజ‌మే.. మెగాస్టార్‌ను మెగా హీరో వెన‌క్కి నెట్టింది నిజ‌మే. అయితే మెగాస్టార్‌ను వెన‌క్కి నెట్టింది సినిమా విష‌యంలోనే.. అది ఎవ‌రా అని అనుకుంటున్నారా.. మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌.

మెగాస్టార్ నటించిన చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. ఈ సినిమా విడుద‌లై ఇప్ప‌టికి 50రోజులు అవుతుంది. ఈ సినిమా దాదాపుగా 33కేంద్రాల్లో అర్థ‌శ‌త‌దినోత్స‌వం పూర్తి చేసుకుంది. ఈఏడాది విడుద‌లైన‌ సినిమా సైరాకు ముందు మ‌రో రెండు సినిమాలు అర్థ‌శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకున్న సినిమాలు ఉన్నాయి. ప్రిన్స్ మ‌హేష్‌బాబు న‌టించిన మ‌హ‌ర్షి సినిమా అర్థ‌శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకున్న సినిమాగా ముందు వ‌రుస‌లో ఉంది. ఈ సినిమా దాదాపుగా 110 కేంద్రాల్లో అర్థ‌శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకుంది.

ఇక విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగాప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ తో మ‌ల్టీస్టార‌ర్ చిత్రంగా తెర‌కెక్కిని ఎఫ్‌2 చిత్రం రెండో స్థానంలో ఉంది. ఈ సినిమా దాదాపుగా 65సెంట‌ర్స్‌లో 50రోజులు పూర్తి చేసుకుంది. ఇక మూడో స్థానంలో సైరా చిత్రం ఉండ‌గా, నాలుగో స్థానంలో అక్కినేని నాగ‌చైత‌న్య, స‌మంత‌ న‌టించిన మ‌జిలి సినిమా 25 సెంట‌ర్స్‌లో 50రోజులు ప్ర‌ద‌ర్శించ‌బ‌డింది. అంటే మెగాస్టార్ న‌టించిన సైరా చిత్రం కేవ‌లం 33 సెంట‌ర్స్ లో అయితే.. వ‌రుణ్ తేజ్ న‌టించిన చిత్రం 65 కేంద్రాల్లో పూర్తి చేసుకుంది.. సో అర్ధ‌శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకున్న సెంట‌ర్ల లెక్క‌ల్లో మెగాస్టార్‌ను వ‌రుణ్‌తేజ్ వెన‌క్కి నెట్టిన‌ట్లే లెక్క‌.

మెగాస్టార్‌ను వెన‌క్కి నెట్టిన మెగా హీరో..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts