స్పీకర్ పదవిని బ్ర‌ష్టుప‌ట్టిస్తోన్న తమ్మినేని

November 8, 2019 at 12:14 pm

స్పీక‌ర్ అంటే రాజ‌కీయాల్లో చాలా హుందాగా ఉండే ప‌ద‌వి. స్పీక‌ర్ ప‌ద‌వికి ఎన‌లేని గౌర‌వం ఉంటుంది. స్పీక‌ర్ అనే ప‌ద‌విలో ఉన్న వాళ్లు రాజ‌కీయాలు, పార్టీలు, రాగ‌ద్వేషాల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అవ‌త‌రించిన‌ప్ప‌టి నుంచి ఎంతో మంది స్పీక‌ర్లు త‌మ ప‌ద‌వుల‌కు వ‌న్నె తెచ్చారు. అసెంబ్లీలో త‌మ పార్టీ వాళ్లు త‌ప్పు చేసినా నిర్మొహ‌మాటంగా వాళ్ల‌కు వార్నింగ్‌లు ఇచ్చేవారు. అయితే రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో స్పీక‌ర్ల వ్య‌వ‌స్థ‌ను పార్టీల నేత‌లు బ్ర‌ష్టుప‌ట్టిస్తోన్న దాఖ‌లాలు క‌నిపిస్తున్నాయి.

ఏపీ తొలి స్పీక‌ర్‌గా ప‌నిచేసిన దివంగ‌త కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఫ‌క్తు రాజ‌కీయ నేత‌గా వ్య‌వ‌హ‌రించారు. అప్ప‌ట్లో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల‌ను చంద్ర‌బాబు త‌మ పార్టీలో చేర్చుకుని వారికి ఏకంగా మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టినా ఆయ‌న కిమ్మ‌న‌లేదు. పైగా తెర‌వెన‌క ఆయ‌న చేసిన మంత్రాగం అంతా ఇంతా కాదు. చివ‌ర‌కు రోజా లాంటి వాళ్లు బాబును విమ‌ర్శిస్తే ఆయ‌న ఏకంగా యేడాది పాటు రోజాను అసెంబ్లీ నుంచి బ‌హిష్క‌రించారు.

కోడెల ఐదేళ్ల పాటు స్పీక‌ర్‌గా కంటే టీడీపీ నేత‌గానే వ్య‌వ‌హ‌రించారు అన్న‌ది నిజం. ఈ విష‌యంలో ఆయ‌న్ను పూర్తిగా త‌ప్పుప‌ట్ట‌క‌పోయినా చంద్ర‌బాబు ఒత్తిళ్లు, డైరెక్ష‌న్‌ను కూడా కాద‌న‌లేని ప‌రిస్థితి. ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జ‌గ‌న్ సీనియ‌ర్ నేత త‌మ్మినేని సీతారంను స్పీక‌ర్‌గా నియ‌మించారు. గ‌తంలో మంత్రిగా కూడా ప‌నిచేసిన అనుభ‌వం ఉన్న త‌మ్మినేని స్పీక‌ర్ ప‌ద‌వి విష‌యంలో ఎందుకో గాని త‌డ‌బాటుకు గుర‌వ్వ‌డంతో పాటు నిర్లిప్త‌త‌తో ఉన్న‌ట్టే క‌నిపిస్తోంది.

చివ‌ర‌కు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న చంద్రబాబుపైనే ఆయ‌న తీవ్రంగా విరుచుకు ప‌డుతున్నారు. చంద్రబాబును ప్రజల మధ్య నిల్చోబెట్టి గుడ్డలూడదీస్తాం… ఆయ‌న అనుభ‌వం మ‌డిచి పెట్టుకోమ‌ని అంటున్నారు. అగ్రిగోల్డ్ ఖాతాదారులకు రూ. పదివేల చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమంలో… చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. హాయ్‌ల్యాండ్‌ భూముల్ని కొట్టేసేందుకు.. చంద్రబాబు, లోకేష్‌ ప్లాన్‌ వేశారని ఆరోపించారు.

స్పీక‌ర్ హోదాలో ఉన్న వ్య‌క్తి మాట్లాడే ప్ర‌సంగాలు… వాడే భాష చాలా ముఖ్యం. కానీ త‌మ్మినేని ఆ విష‌యంలో బ్యాలెన్స్ త‌ప్పేస్తున్నారు. ఆయ‌న ఇలాంటి విమ‌ర్శ‌లు చేయాలంటే త‌న స్పీక‌ర్ ప‌ద‌విని వ‌దిలేసి వైసీపీ అధికార ప్ర‌తినిధి ప‌ద‌వి తీసుకోవాల‌ని టీడీపీ విమ‌ర్శ‌లు చేస్తోంది. టీడీపీ విమ‌ర్శ‌ల సంగ‌తి ఎలా ? ఉన్నా జ‌గ‌న్ ప‌రిపాల‌న‌తో పాటు రూల్స్ విష‌యంలో చాలా స్ట్రిక్ట్‌గా ముందుకు వెళుతున్నారు. ఇలాంటి టైంలో త‌మ్మినేని వ్యాఖ్య‌ల వ‌ల్ల అంతిమంగా జ‌గ‌న్ డైరెక్ష‌న్‌లో ఆయ‌న వెళుతున్నాడా ? అన్న సందేహాలు కామ‌న్ పీపుల్స్‌లో వ‌స్తాయి. అలా వ‌చ్చిన‌ప్పుడు జ‌గ‌న్ ఇమేజ్‌కు డ్యామేజ్ అవుతుంది. ఇక‌పై అయినా ఇలాంటి విష‌యాల్లో త‌మ్మినేని జ‌ర జాగ్ర‌త్త‌గా స్పీక‌ర్ హోదాలో వ్య‌వ‌హ‌రిస్తే జ‌గ‌న్‌కు కూడా మంచి పేరు వ‌స్తుంది.

స్పీకర్ పదవిని బ్ర‌ష్టుప‌ట్టిస్తోన్న తమ్మినేని
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts