మ‌న ద‌ర్శ‌కులే ముద్దంటున్న స్టార్ హీరోలు..!

November 16, 2019 at 3:19 pm

ప్ర‌స్తుత ట్రెండ్ ప్ర‌కారం స్టార్ హీరోల చూపంతా బాలీవుడ్ వైపు ఉంది. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ లాగా పాన్ ఇండియా చిత్రాల్లో న‌టించి బాలీవుడ్‌కు బాట‌లు వేసుకోవాల‌ని ఎదురు చూస్తున్న టాలీవుడ్ స్టార్స్‌కు ఇప్పుడు ఓ క్లారిటి వ‌చ్చింది. ఇంత‌కాలం ప‌ర‌భాష చిత్రాల ద‌ర్శ‌కులతో బాలీవుడ్‌కు బాట‌లు వేసుకోవాల‌ని అనుకున్న ఈ హీరోలు ఇప్పుడు మాతృభాష చిత్రాల ద‌ర్శ‌కులే ముద్దు అని తేల్చేసుకున్నారు. అందుకే ఇప్పుడు ఈ స్టార్ హీరోలు బాలీవుడ్‌కు వెళ్ళే ఆలోచ‌నలో ముంద‌డుగు వేస్తున్నారు..

అయితే ఇప్పుడు ఇద్ద‌రు స్టార్ హీరోలు బాలీవుడ్‌లో త‌మ సత్తాను చాటుకోవాల‌ని ఉబ‌లాట ప‌డుతూనే అది ఇత‌ర భాష చిత్రాల ద‌ర్శ‌కుల‌తో కాకుండా టాలీవుడ్ ద‌ర్శ‌కుల తోనే సాధ్యం చేసుకోవాల‌ని ఉబ‌లాట ప‌డుతున్నారు. అయితే ఇప్ప‌టికే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మెగాహీరో, ఇప్పుడే ఎంట్రీ ఇవ్వాల‌ని ఆరాట ప‌డుతున్న మ‌రో స్టార్ హీరో లు టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుల చిత్రాల్లో న‌టించాల‌ని చూస్తున్నార‌ని టాక్‌. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌లు బాలీవుడ్‌పై బ‌లంగా త‌న‌దైన ముద్ర వేయాల‌ని చూస్తున్నారు.

అయితే ఇప్ప‌టికే మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ హింది చిత్రాల్లో న‌టించి త‌న స‌త్తా చాటాడు. బాలీవుడ్ లో త‌న‌కంటూ ఓఇమేజ్‌ను సృష్టించుకున్నాడు రామ్ చ‌ర‌ణ్‌. ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ మాత్రం బాలీవుడ్‌లో ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ బాలీవుడ్‌కు వెళ్ళెందుకు పాన్ ఇండియా సినిమా లో న‌టించాల‌నుకున్నారు. అందుకు కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్ లేదా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల‌ని ముందుగా అనుకున్నారు. కానీ ఎందుకో మ‌న‌స్సు మార్చుకున్నాడు.

ఇప్పుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, కొర‌టాల శివ లాంటి వారితో పాన్ ఇండియా రేంజ్ సినిమాలో న‌టించాల‌ని అనుకుంటున్నారు. ఈ ద‌ర్శ‌కులతో క‌లిసి ప‌నిచేస్తే అటు పాన్ ఇండియాలో సినిమా స‌క్సెస్ కాకున్నా, టాలీవుడ్‌లో మాత్రం స‌క్సెస్ అవుతుంద‌నే ధీమాతోనే ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నార‌ని టాక్‌. సో తార‌క్‌, రామ్ చ‌ర‌ణ్ లు ఆర్ ఆర్ ఆర్ సినిమా పూర్తి కాగానే పాన్ ఇండియా సినిమాలో న‌టించ‌డం ఖాయ‌మ‌నే అనిపిస్తుంది. ఇది టాలీవుడ్ ద‌ర్శ‌కుల‌తోనే అన్న‌మాట‌.

మ‌న ద‌ర్శ‌కులే ముద్దంటున్న స్టార్ హీరోలు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts