పాత‌పాప‌తో జోడి క‌డుతున్న వెంకటేష్ …!

November 8, 2019 at 4:59 pm

అసుర‌న్ త‌మిళంలో సూప‌ర్ హిట్ కావ‌డంతో తెలుగులో రీమేక్ చేసేందుకు విక్ట‌రీ వెంక‌టేశ్ సిద్ద‌మ‌య్య‌యారు. అయితే వెంక‌టేశ్ స‌ర‌స‌న న‌టించేందుకు సీనియ‌ర్ హీరోయిన్‌ను ఎంపిక చేశారు. అస‌లే వ‌య‌స్సు మీరుతున్న ముదురు హీరో వెంక‌టేశ్‌కు ఇప్ప‌టి కొత్త‌త‌రం హీరోయిన్ల‌ను జ‌త‌క‌లిపితే చూడ‌టానికి బాగోద‌ని అర్థం చేసుకున్న ద‌ర్శ‌కులు పాత త‌రం హీరోయిన్ల‌నే ఎంపిక చేసేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు.

అయితే ఇప్పుడు విక్ట‌రీ వెంక‌టేశ్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ దూకుడు మీదున్నాడు. ప్ర‌స్తుతం త‌న మేన‌ల్లుడు అక్కినేని నాగ‌చైత‌న్య‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కుతున్న చిత్రం వెంకిమామ. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ద‌మైంది. అయితే ఇప్పుడు వెంక‌టేశ్ అసుర‌న్ చిత్రం రీమేక్‌లో న‌టించ‌బోతున్నారు. ఇందులో వెంక‌టేశ్‌కు జ‌త‌గా పాత హీరోయిన్ శ్రియ‌ను ఎంపిక చేసిన‌ట్లు క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. వెంకితో న‌టించేందుకు శ్రియ కూడా సై అంద‌ని చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వినిపిస్తున్న టాక్‌.

అయితే అసుర‌న్ లో వెంక‌టేశ్‌తో జ‌త‌క‌ట్ట‌బోతున్న శ్రియ గతంలో ఇద్ద‌రి హిట్ ఫేయిర్‌గానే రికార్డు ఉంది. ఇప్పుడు శ్రియ‌కు అనుకూల‌మైన వాతావ‌ర‌ణం లేక‌పోవ‌డంతో వెంక‌టేశ్‌తో న‌టించేందుకు సై అంది. ఇంత‌కు ముందు వెంక‌టేశ్‌తో శ్రియ సుభాష్ చంద్ర‌బోస్, గోపాల గోపాల సినిమాల్లో న‌టించింది. ఇప్పుడు అసుర‌న్‌లో న‌టిస్తే ముచ్చ‌ట‌గా మూడో సినిమా అయిన‌ట్లే లెక్క‌. ఇంకా ఈ సినిమాకు ద‌ర్శ‌కుడిని ఎంపిక చేయ‌లేదు నిర్మాత సురేష్‌బాబు. ద‌ర్శ‌కుడిని ఎంపిక చేయ‌గానే ప్రాజెక్టును ప్ర‌క‌టించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు నిర్మాత సురేష్‌బాబు.

పాత‌పాప‌తో జోడి క‌డుతున్న వెంకటేష్ …!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts