షాక్‌: విజ‌యారెడ్డి ఆడియో టేపుల్లో టీఆర్ఎస్ మంత్రి, ఎమ్మెల్యేలు…!

November 5, 2019 at 1:02 pm

హైదరాబాదులోని అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి నిన్న దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సురేశ్ ముదిరాజ్ అనే వ్య‌క్తి ఆమెపై ఆమె ఆఫీస్‌లోనే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘ‌ట‌న ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఇక సురేశ్‌కు సైతం 60 శాతం గాయాల‌వ్వ‌డంతో ఉస్మానియాలో చికిత్స పొందుతూనే వాంగ్మూలం ఇచ్చాడు.

ఇక తాజాగా విజయారెడ్డి మాట్లాడుతున్నట్టున్న ఓ ఆడియో బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఆ ఆడియోలో ఆమె కొందరు రాజకీయ నేతల పేర్లు చెప్పినట్టు తెలుస్తోంది. ఓ మంత్రి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేల పేర్లు ఇందులో ఉండ‌డం.. వారంతా అధికార పార్టీకి చెందిన వారే అన్న మ్యాట‌ర్ బ‌య‌ట‌కు లీక్ అవ్వ‌డంతో ఇప్పుడు ఇది రాజ‌కీయంగా కూడా తీవ్ర ప్ర‌కంప‌న‌లు రేపుతోంది.

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, సురేశ్ ఎవరో తనకు తెలియదని చెప్పారు. సమస్యలు ఉన్నాయంటూ ఎంతో మంది ప్రతిరోజు తనను కలుస్తుంటారని తెలిపారు. ఈ ఉదయం ఆయ‌న విజయారెడ్డి భౌతికకాయానికి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక విజ‌యారెడ్డి హ‌త్య త‌ర్వాత మంచిరెడ్డిపైనే ఎక్కువుగా సందేహాలు వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. భూముల విలువ పెరగడంతో వివాదాలు ఎక్కువయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఏదేమైనా విజ‌యారెడ్డి మాట్లాడిన ఆడియో టేపుల్లో ఉన్న ఆ మంత్రి, ఎమ్మెల్యేలు ఎవ‌రు ? అన్న‌ది ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

షాక్‌: విజ‌యారెడ్డి ఆడియో టేపుల్లో టీఆర్ఎస్ మంత్రి, ఎమ్మెల్యేలు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts