త‌హ‌సీల్దార్ విజ‌యారెడ్డి హ‌త్య‌కేసు నిందితుడు సురేశ్ మృతి

November 7, 2019 at 10:35 am

తెలంగాణ‌లోని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ త‌హ‌సీల్దార్ విజ‌యారెడ్డి హ‌త్య‌కేసులో నిందుతుడిగా ఉన్న సురేశ్ ముదిరాజు మృతిచెందాడు. విజ‌యారెడ్డిపై సోమ‌వారం మ‌ధ్యాహ్నం త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలోనే పెట్రోల్ పోసి నిప్పంటిచ‌డంతో ఆమె అక్క‌డిక‌క్క‌డే మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన విజ‌యారెడ్డి డ్రైవ‌ర్ కూడా ఇప్ప‌టికే మృతిచెందారు. ఇక విజ‌యారెడ్డిపై పెట్రోల్ పోసిన సురేష్ త‌న‌పై కూడా కొంత పెట్రోల్ చ‌ల్లుకోవ‌డంతో అత‌డికి కూడా నిప్పంటుకుంది.

ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కాలిన గాయాలతో ఉన్న సురేష్‌ను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 65 శాతం కాలిన గాయాలతో ఉన్న సురేష్‌కు ఉస్మానియాలో చికిత్స అందిస్తున్నారు. 74 గంటలు దాటితే తప్ప సురేష్ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని ముందే చేతులు ఎత్తేశారు.

ఇక చివ‌ర‌కు గురువారం ఉద‌యం అత‌డి ప‌రిస్థితి మ‌రింత విష‌మించ‌డంతో మృతిచెందాడు. సురేశ్ శ‌రీరంలోని నీరు మొత్తం పోవ‌డంతో వైద్యులు సైతం ఏం చేయ‌లేక చేతులు ఎత్తేశారు. మెజిస్ట్రేట్ సైతం చికిత్స పొందుతున్న సురేశ్‌ నుంచే వాంగ్మూలం తీసుకున్నాడు. ఇదిలా ఉండగా విజయారెడ్డి హత్యకేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నిందితుడు సురేశ్‌ కాల్‌డేటా, విజయారెడ్డి కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో సురేశ్‌ మాట్లాడినట్లు తేలడంతో.. ఈ కేసులో మరికొందరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

త‌హ‌సీల్దార్ విజ‌యారెడ్డి హ‌త్య‌కేసు నిందితుడు సురేశ్ మృతి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts