" />

విశాల్ ‘యాక్ష‌న్‌’ రివ్యూ & రేటింగ్

November 15, 2019 at 3:09 pm

బ్యాన‌ర్‌: శ‌్రీకార్తికేయ సినిమాస్‌
న‌టీన‌టులు: విశాల్, త‌మ‌న్నా, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి, రామ్‌కీ, ఆకాంక్ష పూరి, క‌బీర్ దుహ‌న్ సింగ్, యోగిబాబు త‌దిత‌రులు
మ్యూజిక్‌: హిప్‌హాప్ త‌మిళ‌
సినిమాటోగ్రాఫ‌ర్‌: డుడ్లీ
ఎడిటింగ్‌: ఎన్‌.బి.శ్రీకాంత్‌
స్క్రీన్ ప్లే: వెంక‌ట్ రాఘ‌వ‌న్‌, సుభ, సుంద‌ర్‌.సి
నిర్మాత‌: శ్రీనివాస్ ఆడెపు
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: సుంద‌ర్‌.సి
రిలీజ్ డేట్‌: 15 న‌వంబ‌ర్‌, 2019

త‌మిళంలోపాటు తెలుగులోనూ మంచి మార్క‌ట్‌ను క్రియేట్ చేసుకున్న హీరోల్లో విశాల్ ఒక‌రు. కోలీవుడ్, టాలీవుడ్‌లో ఏక‌కాలంలో సినిమాల‌ను విడుద‌ల చేస్తూ.. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తెచ్చుకున్నారు. భిన్న‌మైన క‌థాంశాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే విశాల్‌.. ఈసారి పూర్తిస్థాయి యాక్ష‌న్ క‌థాంశంతో వ‌చ్చాడు. సి సుంద‌రం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన చిత్రం యాక్ష‌న్‌. విశాల్‌కు జంట‌గా త‌మ‌న్నా న‌టించింది. శుక్ర‌వారం విడుద‌ల అయిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఏమేర‌కు మెప్పించిందో TJ స‌మీక్ష‌లో చూద్దాం..

క‌థ‌లోకి వెళ్దాం…
ఇక క‌థ‌లోకి వెళ్దాం.. ఈ సినిమాలో సుభాష్ (విశాల్‌) మిల‌ట‌రీ క‌మాండ‌ర్‌గా క‌నిపిస్తాడు. ఆర్మీ చేప‌ట్టే ఆప‌రేష‌న్స్‌లో కీల‌కంగా ఉంటాడు. ఇక సుభాష్ తండ్రి ఓ తెలుగు రాష్ట్రానికి సీఎం. సుభాష్ అన్న‌(రామ్‌కీ) డిప్యూటీ సీఎంగా ఉంటాడు. అయితే, ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న త‌న పెద్ద కొడుకు(రామ్‌కీ)ని ముఖ్య‌మంత్రిగా చేయాల‌ని అనుకుంటాడు సుభాష్ తండ్రి. ఈ క్ర‌మంలోనే టెర్ర‌రిస్ట్ నాయ‌కుడు స‌య్య‌ద్ ఇబ్ర‌హీం మాలిక్‌(క‌బీర్ దుహ‌న్ సింగ్‌) ప‌థ‌కం ప్ర‌కారం ఓ బాంబ్ బ్లాస్ట్ చేసి అందులో సీఎం కాబోతున్న సుభాష్ అన్న‌య్య‌ను ఇరికిస్తాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది..? బాంబ్ ఎందుకు పేల్చాడు..? సుభాష్ అన్న‌ను ఎందుకు ఇరికించాడు..? సుభాష్ ఏం చేశాడు..? ఈ జ‌ర్నీలో విశాల్‌కు మ‌ర‌ద‌లు ఐశ్వ‌ర్య లక్ష్మి, తోటి ఆఫీస‌ర్ త‌మ‌న్నాతో ఎలాంటి రిలేష‌న్ ఉంది ? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాల‌ను మాత్రం తెర‌పైనే చూడాలి మ‌రి.

TJ విశ్లేష‌ణ :
అయితే.. హీరో విశాల్ విష‌యానికి వ‌స్తే.. పూర్తి స్థాయి యాక్ష‌న్ సినిమా చేయ‌డం ఇదే ఫ‌స్ట్‌. అలాగే.. ద‌ర్శ‌కుడు సుంద‌ర్‌కు కూడా యాక్ష‌న్ సినిమా ఇదే మొద‌టి సారి. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో మంచి మార్కెట్ ఉంది విశాల్‌కు. ఇక సినిమా టైటిల్‌, ట్రైల‌ర్‌తోనే చెప్పేశారు.. ఈ సినిమాలో ఎలాంటి యాక్ష‌న్ సీన్లు ఉంటాయో. క‌థ‌లో ప్ర‌ధాన పాయింట్‌ను తీసుకుని యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను తీర్చిదిద్దారు ద‌ర్శ‌కుడు సుంద‌ర్‌. ఇక విశాల్ యాక్ష‌న్ సీన్స్‌లో అద్భుతంగా న‌టించాడు. స‌హ‌జంగా.. ఫైట్ సీన్ల‌లో విశాల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఇక ఈ సినిమాలో ఇంట‌ర్వెల్ ఫైట్ సీన్ హైలైట్‌గా ఉంటుంది. అయితే.. క‌థ‌లో కొత్త‌ద‌నం ఏమీ లేకున్నా.. ద‌ర్శ‌కుడు క‌థ‌ను న‌డిపించిన తీరు అద్భుతంగా ఉంద‌ని చెప్పొచ్చు. అదే ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటుంది. విశాల్ న‌ట‌న సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. ఆయ‌న తీసుకున్న రిస్క్ మామూలుగా ఉండ‌దు. ఇక త‌మ‌న్నా విశాల్‌కు సాయం చేసే తోటి ఆఫీస‌ర్‌గా అత‌డితో ప్రేమ‌లో ప‌డ‌డంతో పాటు ప‌లు యాక్ష‌న్ సీన్ల‌లో న‌టించి ఆక‌ట్టుకుంది. ఇదే స‌మ‌యంలో అందాల ఆర‌బోత‌లోనూ ముందువ‌రుస‌లోనే ఉంది. క‌బీర్ దుహ‌న్ సింగ్ టెర్ర‌రిస్ట్ నాయ‌కుడడి పాత్ర‌లో మెప్పించాడు. యోగిబాబు, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. విశాల్ మ‌ర‌ద‌లిగా న‌టించిన ఐశ్వ‌ర్య ల‌క్ష్మికి, విశాల్‌కు మ‌ధ్య కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. ఆకాంక్ష సింగ్ అల్ట్రా మోడ్రన్‌గా, హాట్‌గా ఓ పాట‌లో క‌న‌ప‌డుతుంది.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే…
సినిమాలో అన్నింటిక‌న్నా సినిమాటోగ్ర‌ఫీకే ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. డుడ్లీ కెమెరా వ‌ర్క్ సూప‌ర్బ్ అని చెప్పొచ్చు. హిప్ హాప్ సంగీతం కూడా ఆక‌ట్టుకుంటుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం సూప‌ర్బ్‌. బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ సీన్ల‌ను ఎలివేట్ చేసింది. మొత్తంగా ఈ సినిమా యాక్ష‌న్ ప్రియుల‌ను ఆమాత్రం బాగా ఆక‌ట్టుకుంటుంద‌ని చెప్పొచ్చు. ఇక విశాల్ కెరీర్‌లో చెప్పుకోద‌గ్గ సినిమాగా నిలుస్తుంది.

ఇక దర్శకుడు ఎక్కడా యాక్షన్ ట్రీట్ తగ్గకుండా భారీ యాక్షన్స్ సీన్స్ తో సినిమాని నడిపాడు. ఇంట‌ర్వెల్ సీన్‌, అక్క‌డ వ‌చ్చే ఫైట్‌, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో యాక్షన్ సీక్వెన్స్ స్, మరియు కొన్ని ఛేజింగ్ సీన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అదే టైంలో క‌థ మాత్రం చాలా నార్మ‌ల్ లైన్‌తో ఉంటుంది. సినిమాలో క‌థ‌ను మించి యాక్ష‌న్ ఎక్కువైంది.

ఫైన‌ల్‌గా…
కంప్లీట్ ప‌వ‌ర్ ప్యాక్డ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ట్రీట్మెంట్‌, స్క్రీన్ ప్లే, స్పీడ్ మూమెంట్‌తో ముందుకు సాగినా ఏ మాత్రం లాజిల్ లేని సీక్వెన్సెస్, సాగ‌దీత‌తో కొన్ని చోట్ల బోర్ కూడా కొట్టించింది. అయితే సినిమాలో విశాల్ యాక్ష‌న్‌, ఫైట్లు, త‌మ‌న్నా అందాల ఇవ‌న్నీ యాక్ష‌న్ ప్రియుల‌కు మాత్రం మంచి ట్రీట్ ఇస్తాయి.

ఫైన‌ల్ పంచ్‌: ఓన్లీ యాక్ష‌న్‌… యాక్ష‌న్‌

యాక్ష‌న్ TJ రేటింగ్‌: 2.75/5

విశాల్ ‘యాక్ష‌న్‌’ రివ్యూ & రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts