విశాల్ ‘ యాక్ష‌న్ ‘ AP – TG ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌

November 16, 2019 at 3:40 pm

కోలీవుడ్ యంగ్ క్రేజీ హీరో విశాల్ న‌టించిన యాక్ష‌న్ సినిమా రిలీజ్‌కు ముందు మంచి హైప్ తెచ్చుకుంది. సుంద‌ర్‌.సి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా టీజ‌ర్లు, ట్రైల‌ర్లు ఆస‌క్తిగా ఉండ‌డంతో పాటు విశాల్ కెరీర్‌లోనే రు.60 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా మంచి ప్రీ-రిలీజ్ బజ్ కలిగి ఉంది.

తెలుగుతో పాటు త‌మిళంలోనూ ఒకే రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన యాక్ష‌న్ తొలి ఆట‌కే మంచి టాక్ తెచ్చుకుంది. మొదటి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 75 లక్షలకు పైగా షేర్ రాబ‌ట్టింది. అయితే ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ రైట్స్ రు.8 కోట్ల‌కు అమ్మారు. మ‌రి ఫ‌స్ట్ వీకెండ్‌తో పాటు లాంగ్ ర‌న్లో యాక్ష‌న్ మ‌రింత‌గా వ‌సూళ్లు రాబ‌ట్టాల్సి ఉంది.

విశాల్ అభిమ‌న్యుడు, పందెంకోడి 2 లాంటి సినిమాలు తెలుగులో లాంగ్ ర‌న్‌లో రు.8-10 కోట్ల వ‌ర‌కు రాబ‌ట్టాయి. మ‌రి మంచి హిట్ టాక్‌తో స్టార్ట్ అయిన యాక్ష‌న్ ఎంత వ‌సూలు చేస్తుందో ? చూడాలి. ఈ సినిమాలో మిల్కీబ్యూటీ త‌మ‌న్నాతో పాటు ఐశ్వ‌ర్య ల‌క్ష్మి విశాల్ స‌ర‌స‌న హీరోయిన్లుగా న‌టించారు.

విశాల్ ‘ యాక్ష‌న్ ‘ AP – TG ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts