యార్ల‌గ‌డ్డ కూడా రివ‌ర్స్‌…. ఎలా స‌మ‌ర్థించుకుంటాడో…!

November 8, 2019 at 4:42 pm

ఏపీలో సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి తెలుగు మీడియం ఎత్తేసి.. ఇంగ్లీష్ మీడియం మాత్ర‌మే ఉంచాల‌నుకుంటోన్న నిర్ణ‌యంపై ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల స్పంద‌న‌లు వ‌స్తున్నాయి. ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై విప‌క్షాల‌తో పాటు తెలుగు భాషావాదుల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై అధికార భాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సమర్థించారు. తెలుగు విష‌యంలో ఏదైనా త‌క్కువ జ‌రిగిన‌ట్టు భావిస్తే వెంట‌నే విరుచుకుప‌డే యార్ల‌గ‌డ్డ ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థిస్తుండ‌డంతో అంద‌రూ షాక్ అవుతున్నారు.

అల్పాదాయ, మధ్య ఆదాయ వర్గాల పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం పెట్టాలని జగన్‌ పాదయాత్రలో చెప్పారు, ప్రజాభీష్టానికి అనుగుణంగానే ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెప్ప‌డం కొస‌మెరుపు. ఏపీలోని అన్ని పాఠ‌శాల‌ల్లో ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు తెలుగును త‌ప్ప‌నిస‌రి చేస్తూ ఇప్ప‌టికే జీవో ఉంద‌ని… ప్రాథ‌మిక విద్య విష‌యంలో తెలుగు వినిపిస్తుంది.. క‌నిపిస్తుంద‌ని ఆ విష‌యంలో ఎలాంటి ఇబ్బంది ఉండ‌దంటూ ఆయ‌న ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించారు.

అయితే ఇదే యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్ గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో అర్బ‌న్ ప్రాంతాల్లో అది కూడా ఇంగ్లీష్ మీడియంలో చ‌ద‌వాల‌నుకునే విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియం ప్ర‌వేశ‌పెడితే చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. చంద్ర‌బాబు తెలుగును భూస్థాపితం చేసేందుకు కుట్ర‌లు ప‌న్నుతున్నాడంటూ ఆయ‌న తీవ్రంగా విమ‌ర్శ‌లు చేసేవారు. ఇప్పుడు జ‌గ‌న్ ఏకంగా 1-10 త‌ర‌త‌గ‌తి వ‌ర‌కు అంతా ఇంగ్లీష్ మీడియంలోనే చ‌ద‌వాలంటూ విమ‌ర్శ‌లు చేసినా స‌మ‌ర్థిస్తుండ‌డంతో యార్ల‌గ‌డ్డ పూర్తిగా జ‌గ‌న్ త‌ర‌పున వ‌క‌ల్తా పుచ్చుకుంటున్నాడా ? అని చ‌ర్చించుకుంటున్నారు.

అయితే దీని వెన‌క బాబు త‌న‌కు ప‌ద‌వులు ఇవ్వ‌లేద‌న్న ఆక్రోశం కూడా ఉందంటున్నారు. చంద్ర‌బాబు టైంలో ఆయ‌న‌కు ఎలాంటి ప‌ద‌వులు రాలేదు. కానీ జ‌గ‌న్ మాత్రం ఆయ‌న‌కు పిలిచి మ‌రీ రెండు ప‌ద‌వులు ఇచ్చారు. ఆ రెండు ప‌ద‌వులు రావ‌డంతోనే తెలుగు ఏమైపోతే నాకేంటి అన్న ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి.

ఏదేమైనా యార్ల‌గ‌డ్డ‌కు ఒక‌టి రెండు ప‌ద‌వులు అడ‌క్కుండానే జ‌గ‌న్ ఇవ్వ‌డంతో ఆయ‌న కూడా తాను గ‌తంలో ఫాలో అయిన సిద్ధాంతాల‌ను ప‌క్క‌న పెట్టేసి… తెలుగు ఏమైపోతే నాకేంటి ? అన్న ధోర‌ణితో ముందుకు వెళుతున్నార‌ని.. ఈ విష‌యంలో ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు సంవ‌త్స‌రాలుగా ఫాలో అయిన విలువ‌ల‌ను తుంగ‌లో తొక్కేశార‌న్న విమ‌ర్శ‌లు ఎక్కువుగా వ‌స్తున్నాయి. మ‌రి వీటిపై ఆయ‌న ఎలా రియాక్ట్ అవుతారో ? ఎలా స‌మ‌ర్థించుకుంటారో ? చూడాలి.

యార్ల‌గ‌డ్డ కూడా రివ‌ర్స్‌…. ఎలా స‌మ‌ర్థించుకుంటాడో…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts