వంశీని జ‌గ‌న్ ఎందుకు న‌మ్మ‌డం లేదు!

November 18, 2019 at 12:36 pm

వ‌ల్ల‌భ‌నేని వంశీ ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారాడు. రెండు రోజుల తేడాలో అటు జ‌గ‌న్‌, ఇటు చంద్ర‌బాబు, అటు బీజేపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రిని క‌లిసి క‌ల‌కలం రేపిన వంశీ ఆ త‌ర్వాత టీడీపీలో ఉంటాన‌న్న‌ట్టుగా ఊగిస‌లాడాడు. చివ‌ర‌కు జ‌గ‌న్‌తో క‌లిసి న‌డుస్తా… వైసీపీ స‌ర్కార్‌కు మ‌ద్ద‌తు ఇస్తాన‌ని… వైసీపీలో చేర‌తాన‌ని ఇప్పుడు అంతా తూచ్ అన్న‌ట్టుగా మాట్లాడుతున్నాడు.

నిన్న‌టికి నిన్న న‌న్ను పార్టీలో చేర్చుకుంటార‌ని జ‌గ‌న్ చెప్పారని నేను అన్నానా అని మీడియా వాళ్ల‌ను ఎదురు ప్ర‌శ్నించ‌డంతో అంతా అవాక్క‌య్యారు. వాస్త‌వానికి ఎన్నిక‌ల‌కు ముందు నుంచే వంశీ ఊగిస‌లాడుతూనే ఉన్నారు. ఎన్నిక‌ల‌య్యాక ఆయ‌న వైసీపీలోకి వెళ‌తార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఆ పార్టీ మారేదేదో ఇంత నాన్చ‌కుండా మారి ఉంటే వైసీపీ ద‌గ్గ‌ర వంశీ క్రేజ్ వేరేగా ఉండేది.

ఇద్ద‌రు మంత్రుల‌తో క‌లిసి జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి నానా హ‌డావిడి చేశాడు. ఆ త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి అన్నాడు… అటు జ‌గ‌న్ సైతం వంశీని త‌న ద‌గ్గ‌ర‌కు తీసుకు వ‌చ్చిన ఇద్ద‌రు మంత్రుల‌కు చీవాట్లు పెట్టిన‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. అంటే వంశీ విష‌యంలో జ‌గ‌న్ సైతం న‌మ్మ‌కంతో లేడ‌నే తెలుస్తోంది. ఇక అవినాష్ నాన్చుడు లేకుండా టీడీపీకి రాజీనామా చేసిన గంట‌కే వైసీపీలో చేరిపోయారు.

ఇప్పుడు వైసీపీ వాళ్లు అవ్వొచ్చు.. జ‌గ‌న్ అవ్వొచ్చు అవినాష్‌ను న‌మ్మిన‌ట్టేగా వంశీని న‌మ్మే ప‌రిస్థితి లేదు. వంశీ టీడీపీ నుంచి స‌స్పెండ్ అవ్వ‌డంతో స్వ‌తంత్య్ర ఎమ్మెల్యేగా ఉండి వైసీపీకి స‌పోర్ట్ చేసినా వాళ్లు న‌మ్మే ప‌రిస్థితి లేదు. ఇక టీడీపీ వాళ్లు ఇక ఎప్ప‌ట‌కీ మ‌నోడిని న‌మ్మ‌రు. ఇంకా చెప్పాలంటే టీడీపీ వంశీకి శాశ్వ‌తంగా డోర్లు క్లోజ్ చేసేసిందంటున్నారు.

టీడీపీ నుంచి ఎంతో మంది బ‌య‌ట‌కు వెళ్లారు.. వాళ్లెవ్వ‌రూ వంశీలా దారుణంగా తిట్ట‌లేదు. అవినాష్ పార్టీ మారినా కూడా సానుభూతి ఉంది. కానీ వంశీ విష‌యంలో అదేం లేదు. మొన్న‌టికి మొన్న ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్ర‌సాద్‌ను తిట్టిన వంశీ నిన్న‌టికి నిన్న క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అలాగే మొన్న బాబును తిట్టి… బాబు బీ ఫామ్ ఇచ్చిన వాళ్లలో ఎంత‌మంది గెలిచార‌ని బాబును బండ బూతులు తిట్టి.. నిన్న‌టికి నిన్న బాబు త‌న‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఇచ్చార‌ని ఓ ప్ర‌శంస వ‌దిలాడు.

ఏదేమైనా ఆస్తులు కాపాడుకోవాల‌న్న ఆతృతో లేదా, కేసుల భ‌య‌మో ? లేదా ? విప‌క్ష పార్టీలో ఉండ‌లేన‌న్న డౌటో ? వైసీపీలోకి వెళ్లాల‌న్న ఆశో కాని వంశీ స‌రైన నిర్ణ‌యం తీసుకోలేక రాజ‌కీయంగా ఎవ్వ‌రూ న‌మ్మ‌ని స్థితికి ప‌డిపోయాడు. రేప‌టి వేళ వంశీ వైసీపీలోకి వెళ్లినా జ‌గ‌న్ ఎంత వ‌ర‌కు మ‌న‌స్ఫూర్తిగా న‌మ్ముతాడ‌నేది డౌటే…!

వంశీని జ‌గ‌న్ ఎందుకు న‌మ్మ‌డం లేదు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts