కేబినెట్లో ఉంటారా.. వెళ‌తారా… ఆ న‌లుగురికి జ‌గ‌న్ వార్నింగ్‌….!

November 16, 2019 at 3:57 pm

అవినీతి, అక్ర‌మాల ఆరోప‌ణ‌లు వ‌స్తున్న న‌లుగురు మంత్రులకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ప‌ద్ధ‌తి మార్చుకోకుంటే వ‌చ్చే రెండు నెలల్లో వారికి ఉద్వాస‌న త‌ప్ప‌ద‌న్న ప్ర‌చారం పార్టీలో జోరుగా సాగుతుండ‌టం గ‌మ‌నార్హం. అధికారంలోకి వచ్చి ఐదు నెలు దాటిన తరువాత ముఖ్యమంత్రి అవినీతికి, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్న మంత్రులపై ఆగ్రహంతో ఉన్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. పోలిటిక‌ల్ క‌రప్ష‌న్‌, అవినీతి, అక్ర‌మాల‌ను ఎంత‌మాత్రం స‌హించ‌బోన‌ని ముఖ్య‌మంత్రి మొద‌టి నుంచి చెబుతూ వ‌స్తున్నారు.

ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తీసుకువ‌చ్చే పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌పై వేటు వేస్తాన‌ని ప‌లుమార్లు విస్ప‌ష్టంగానే చెప్పారు. అవినీతి ఆరోప‌ణ‌లపై ముఖ్య‌మంత్రి దృష్టికి వ‌చ్చిన వారిలో ఇద్దరు బీసీ మంత్రులు, ఒక ఓసీ మంత్రి, మరో ఎస్సీ మహిళా మంత్రి ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీరిలో రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు ఇద్దరు ఉండగా…ఇద్దరు కోస్తా ఆంధ్రాకు చెందిన వారని సమాచారం. ఇందులో ఒక మంత్రిపై అవినీతి ఆరోప‌ణ‌లు లేక‌పోయినా త‌న వ్య‌వ‌హ‌ర‌శైలి.. ఒంటెద్దు పొక‌డ‌ల‌తో పార్టీకి జిల్లాలో న‌ష్టం వాటిల్లుతోంద‌ని ఎమ్మెల్యేలంతా మూకుమ్మ‌డిగా జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేశార‌ట‌.

స‌ద‌రు మంత్రికి జిల్లాలో ఓ బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గం ఎమ్మెల్యేల నుంచి స‌హ‌కారం ఉండ‌డం లేదు. వీరంతా స‌ద‌రు మంత్రిపై క‌క్ష క‌ట్టార‌న్న మరో ప్ర‌చార‌మూ ఉంది. ఇదే విష‌యంపై స‌ద‌రు మంత్రితో ముఖ్య‌మంత్రి మాట్లాడాలి..నాయ‌క‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించండి అంటూ సున్నితంగా..అర్థ‌మ‌య్యేలా చెప్పార‌ట‌. ఇక ఎస్సీ మ‌హిళా మంత్రి పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి ఎన్నో త్యాగాలు చేసి జ‌గ‌న్ వెంట న‌డిచారు. ఆమె బంధువ‌ర్గం ఆమె పేరు చెప్పుకుని దందాలు చేస్తున్నా… అవి ఆమెకు తెలిసినా ఎంక‌రేజ్ చేస్తుండ‌డం కూడా జ‌గ‌న్‌కు న‌చ్చలేదంటున్నారు.

ప్రస్తుతానికి నలుగురు మంత్రుల వ్యవహారశైలిపై ఆయన ఆగ్రహంతో ఉన్నారని….అయితే ఇప్ప‌టికి ఇప్పుడు వారిపై క‌ఠిన చ‌ర్య‌లు ఉండ‌బోవ‌న్న‌ది మ‌రికొంత మంది అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. వేచిచూసే ధోర‌ణితో జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తార‌ని..పార్టీ విధానాల‌కు అనుగుణంగా ప‌నిచేయ‌కుండా ధిక్కార ధోర‌ణితో వెళ్తే మాత్రం త‌ప్ప‌క చ‌ర్య‌లుంటాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని చెబుతున్నారు.

మంత్రుల ప‌నితీరు…మిగిలిన వారికి అవ‌కాశాలు అనే విష‌యాన్ని ప్ర‌భుత్వ ఏర్పాటు స‌మ‌యంలోనే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి చెప్పార‌ని, మంత్రి వ‌ర్గంలో మార్పులు..చేర్పులు..విస్త‌ర‌ణ‌లో జ‌రిగే స‌హాజ ప్ర‌క్రియేన‌ని ఇంకొంత‌మంది నేత‌లు చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.

కేబినెట్లో ఉంటారా.. వెళ‌తారా… ఆ న‌లుగురికి జ‌గ‌న్ వార్నింగ్‌….!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts