అమోజాన్‌లో వైసీపీ ప్రొడ‌క్ట్స్‌ …జగన్ అభిమానులకు పండగే

November 4, 2019 at 4:06 pm

ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్ మయం అయిపోయింది. ఆన్‌లైన్ మార్కెటింగ్ అందుబాటులోకి వచ్చాక ఆహార పదార్థాల నుంచి మనకు కావలసిన ఏ వస్తువులు అయినా ఒకే ఒక్క క్లిక్ తో కొనుగోలు చేసుకునే వీలు చిక్కింది. దీంతో ఇప్పుడు ఎవరికి వారు సింపుల్ గా ఆన్‌లైన్లో తమకు కావలసిన వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. ఆన్‌లైన్ సేల్స్ పెంచేందుకు ప్రముఖ సంస్థలు ఎన్నో ఆఫర్లతో కస్టమర్లకు లభిస్తున్నాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే మార్కెటింగ్ టెక్నిక్స్‌తో ఎవరు అమ్మని వస్తువులను సైతం ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాయి.

ఇక ఇప్పటి వరకు నిత్యావసరాల వస్తువులపై దృష్టి పెట్టిన ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు సరికొత్త వ్యాపారంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. రాజకీయ పార్టీలకు చెందిన వస్తువులను కూడా అమెజాన్ ఆన్‌లైన్లో అమ్మకానికి పెట్టింది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ జెండా అమెజాన్ ఆన్‌లైన్ విక్రయిస్తోంది. ఇవి కారు లేదా ఇతర వాహనాల్లో డ్యాష్ బోర్డుపై పెట్టుకోవడానికి ఉపయోగపడే జెండాలు మాత్రమే. ఈ జెండా ధరను రూ. 378గా నిర్ణయించారు.

అమోజాన్ ఈ ఆఫ‌ర్ ఇవ్వ‌డంతో వైసీపీ అభిమానులు, కార్య‌క‌ర్త‌లు ఈ జెండాను కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఇక ఈ జెండా కొన్న‌వారు మంచి స్టార్స్ ఇవ్వ‌డంతో డిమాండ్ మ‌రింత‌గా పెరుగుతోంది. ఇక వైసీపీకి చెందిన అభిమానులు త‌మ వాహ‌నానికి త‌గ్గ‌ట్టుగా జెండాను ఎంపిక చేసుకుంటున్నారు. మ‌రి ఈ త‌ర‌హా వ్యాపారం భ‌విష్య‌త్తులో ఎలా ఉంటుందో ? గాని అమోజాన్ మాత్రం స‌రికొత్త ప్ర‌యోగం చేసి స‌క్సెస్ అయ్యింది.

అమోజాన్‌లో వైసీపీ ప్రొడ‌క్ట్స్‌ …జగన్ అభిమానులకు పండగే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts