పవన్ పై జనసేన ఎమ్మెల్యే తిరుగుబాటు!

December 13, 2019 at 4:32 pm

ఒకే ఒక్క అసెంబ్లీ సీటుతో స‌రిపెట్టుకున్న జ‌న‌సేన‌కు ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా మిగిలే ప‌రిస్థితులు క‌న‌ప‌డ‌డం లేదు. ఎన్నిక‌లు జ‌రిగి ఆరు నెల‌లు మాత్ర‌మే కంప్లీట్ అయ్యాయి. ఇక ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద‌రావు నాలుగైదు నెల‌ల నుంచి జ‌న‌సేన‌లో ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌ని విధంగానే కామెంట్లు చేస్తూ వ‌స్తున్నారు. అసెంబ్లీలో వీలున్న‌ప్పుడ‌ల్లా సీఎం జ‌గ‌న్‌ను పొగిడేస్తున్నారు. మంత్రి విశ్వ‌రూప్‌తో ఆయ‌న ట‌చ్‌లో ఉంటున్నారు. గ‌తంలో వీరిద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్న‌ప్ప‌టి నుంచే వీరి మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద అదే విశ్వ‌రూప్‌తో క‌లిసి జ‌గ‌న్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం కూడా చేశారు.

ఇక అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియాన్ని స‌మ‌ర్థిస్తూ అటు ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుకు చుర‌క‌లు వేసి.. ఇటు జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే సొంత పార్టీ అధినేత‌.. అది కూడా త‌న సొంత జిల్లాలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న రైతు సౌభాగ్య దీక్షను చేపట్టడం డుమ్మా కొట్ట‌డాన్ని బ‌ట్టి చూస్తే రాపాక పార్టీలో ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌నే స్ప‌ష్ట‌మైపోతుంది. ఇందుకోసం పెద్ద పెద్ద విశ్లేష‌ణ‌లు, చ‌ర్చ‌లు కూడా అన‌వ‌స‌ర‌మే.

రాపాక ఒకే ఒక్క ఎమ్మెల్యేగా ఉండి జ‌న‌సేన‌లో చేయ‌డానికేం లేదు. అటు పార్టీ నుంచి కూడా ఆయ‌న‌కు అంత స‌పోర్ట్ లేదు. అదే ఆ పార్టీ నుంచి స‌స్పెన్ష‌న్‌కు గుర‌య్యి… వంశీలా స్వ‌తంత్య్ర ఎమ్మెల్యేగా ఉంటే.. ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ఇబ్బందులు ఉండ‌వు… అభివృద్ధి ప‌నుల కోసం నిధులు కూడా వ‌స్తాయి. వ‌చ్చే ఐదేళ్ల త‌ర్వాత అన్ని బాగుంటే జ‌గ‌న్ వైసీపీ టిక్కెట్ ఇచ్చినా ఇవ్వొచ్చు. ఈ ఐదేళ్లు రాపాక వైసీపీకి చేసే కోప‌రేష‌న్ బ‌ట్టే ఈ తంతు న‌డుస్తుంది.

ఇదిలా ఉంటే రాపాక రైతు సౌభాగ్య దీక్ష‌కు ఉద్దేశ పూర్వ‌కంగానే డుమ్మా కొట్టార‌న్న‌ది క్లీయ‌ర్ క‌ట్‌గా తెలుస్తోంది. ఆయ‌న ఎంత బిజీగా ఉన్నా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వ్వ‌కుండా ఉండే ఛాన్సే లేదు. దీనిపై ఆయ‌న‌కు పార్టీ నుంచి షోకాజ్ నోటీసులంటూ వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై ఘాటుగా స్పందించిన రాపాక నేను గెలిచిన ఎమ్మెల్యేను… నాకు ఓడిన వాళ్లు షోకాజ్ నోటీసులు ఇవ్వ‌డం ఏంట‌ని ? ఘాటుగానే ఫైర్ అయ్యారు.

తాను జ‌న‌సేన‌, ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల వ‌ల్ల గెల‌వ‌లేద‌ని.. త‌న సొంత శ‌క్తితోనే గెలిచాన‌ని… ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌లు చూస్తే రాపాక ఎంత త్వ‌ర‌గా జ‌న‌సేన నుంచి బ‌య‌ట‌పడ‌దామా ? అన్న ధోర‌ణితోనే ఉన్నార‌ని తెలుస్తోంది. అక్క‌డితో ఆగ‌ని రాపాక ప‌వ‌న్ రెండు చోట్ల ఓడిపోయిన విష‌యం కూడా ప్ర‌స్తావించాడు. ప‌వ‌న్ పేరెత్త‌కుండానే…విరుచుకుప‌డ్డారు… దిశానిర్దేశం లేని పార్టీలో ఉండ‌న‌ని.. మ‌ళ్లీ రాజీనామా చేసి కూడా గెలుస్తానంటూ స‌వాల్ చేశాడు.

మ‌రోసారి షోకాజ్ నోటీసులు అంటే చెత్త ప్ర‌క‌ట‌న‌లు ఇస్తే.. ఏం చేయాల త‌న‌కు తెలుస‌ని కూడా చెప్పాడు. ట్విస్ట్ ఏంటంటే రాపాక‌కు నిజంగానే షోకాజ్ ఇచ్చారో లేదో తెలియ‌దు కాని.. వెంట‌నే అది ఫేక్ అంటూ పార్టీ ఏ ప్ర‌క‌టన విడుద‌ల చేయ‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. లేక‌పోతే రాపాక ఇంకెంత ప‌రువు తీస్తాడో ? అని వాళ్ల‌కు టెన్ష‌న్ ప‌ట్టుకున్న‌ట్టు ఉంది.

పవన్ పై జనసేన ఎమ్మెల్యే తిరుగుబాటు!
0 votes, 0.00 avg. rating (0% score)