‘ అల వైకుంఠ‌పురంలో ‘ టీజ‌ర్… త్రివిక్ర‌మ్ మార్క్ పంచ్ డైలాగ్స్‌… స్మార్ట్ యాక్ష‌న్ (వీడియో)

December 11, 2019 at 4:37 pm

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోన్న అలా వైకుంఠపురంలో టీజ‌ర్ వ‌చ్చేసింది. అంద‌రూ ఊహించిన విధంగానే త్రివిక్ర‌మ్ మార్క్ స్టైల్లో టీజ‌ర్ చాలా గ్రాండ్‌గా ఉంది. విజువ‌ల్స్‌, నేప‌థ్య సంగీతం అదిరిపోయింది. అల్లు అర్జున్ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. పంచ్ డైలాగులు, సింపుల్ యాక్ష‌న్ బాగుంది. డైలాగులు వెంటనే ప్రేక్షకులకు రిజెక్ట్ అవుతాయి.

ఇక సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ మంచి స్క్రీన్ ల‌భించింది. సుశాంత్‌కు మంచి క్యారెక్ట‌ర్ ఉంద‌ని టీజ‌ర్లోనే చెప్పేశారు. ఇక స‌ముద్ర‌ఖ‌ని, ట‌బు క్యారెక్ట‌ర్లు కూడా బాగున్నాయి. స్టైల్‌గా ఉంది క‌దా.. నాక్కూడా న‌చ్చింది – మేడం సార్. మేడం అంతే – మీరు ఇప్పుడే కారు దిగారు.. నేను ఇప్పుడే క్యారెక్ట‌ర్ ఎక్కా లాంటి డైలాగులు ఒక్క‌సారిగాకే ఎక్కేస్తాయి.

ఇక థ‌మ‌న్ బీజీఎం టీజర్‌ను మరో స్థాయికి తీసుకువెళుతుంది. పూజా హెగ్డే అందంగా కనిపించింది. టీజ‌ర్ ఖ‌చ్చితంగా అంచ‌నాలు అందుకుంది. ఇక ఇప్పుడు అంద‌రూ ట్రైల‌ర్ కోసం వెయిట్ చేస్తున్నారు. హారిక & హాసిని క్రియేష‌న్స్ , గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లు అర‌వింద్‌, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా అలా వైకుంఠపురంలో జనవరి 12 న విడుదల కానుంది.

‘ అల వైకుంఠ‌పురంలో ‘ టీజ‌ర్… త్రివిక్ర‌మ్ మార్క్ పంచ్ డైలాగ్స్‌… స్మార్ట్ యాక్ష‌న్ (వీడియో)
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts