ఆలా వైకుంఠపుర్రములో – టీజర్ గ్లింప్సె

December 9, 2019 at 5:01 pm

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురము లో’ సంక్రాంతి పండగకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. మూడు నెలల ముందు నుంచే ఈ సినిమా ప్రచారం ప్రారంభమై ఒక్కొక్క పాటను విడుదల చేస్తున్నారు. విడుదల తేదీ సమయం దగ్గర పడటంతో టీజర్ రిలీజ్ కు సన్నద్ధమైంది చిత్రం యూనిట్.

ఈరోజు టీజర్ గ్లింప్స్ ను ను విడుదల చేస్తూ.. సినిమా టీజర్ను డిసెంబర్ 11 వ తేదీన విడుదల చేస్తున్నట్టు ‘అల వైకుంఠపురములో’ టీమ్ ప్రకటించింది. ఈ సందర్భంగా టీజర్ గ్లింప్స్ లో బన్నీ రెడ్ కోటు వేసుకొని, టేబుల్ పైన నడిచి వచ్చే ప్రోమోను రిలీజ్ చేశారు. ఇది బన్నీ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అనే చెప్పవచ్చు. ఇప్పటికే ‘అల వైకుంఠపురములో’ సినిమా నుండి మూడు పాటలు విడుదల కాగా రెండు పాటలకు భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా టీజర్ పై ఇప్పటికే అంచానలు పెరిగిపోయాయి. మరి ఈ టీజర్ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో వేచి చూడాలి.

ఆలా వైకుంఠపుర్రములో – టీజర్ గ్లింప్సె
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts