అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు.. ఫ‌స్ట్‌డే క‌లెక్ష‌న్ ఎంతో తెలుసా..!

December 13, 2019 at 5:22 pm

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు (కమ్మ రాజ్యంలో కడప రెడ్లు). 2019 ఎన్నికలు ముగిసిన తరువాత నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఆధారం చేసుకుని.. వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కొంత మంది రాజకీయనాకుల పై సెటైరికల్ గా ఉండేలా.. తీసి క్యూరియాసిటీ పెంచాడు. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ప్రతిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్‌, జ‌న‌సేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మ‌త ప్ర‌భోధ‌కుడు కేఎ పాల్‌ల‌ను పాత్ర‌లుగా చేసుకుని ఈ సినిమాను రూపొందించాడు. చివ‌రికి దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, అమిత్ షా ను సైతం వదిలిపెట్టలేదు.

ఇక ఈ చిత్రాన్ని మొదట నవంబర్ 29న విడుదల చేయాలని భావించినప్పటికీ.. సెన్సార్ పూర్తికాకపోవడంతో నిలిచిపోయింది. మొత్తానికి సెన్సార్ పూర్తవ్వడంతో డిసెంబర్ 12న(నిన్న) ఈ చిత్రాన్ని విడుదల చేసాడు . ఇక మొదటి రోజు ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోయాయనే చెప్పాలి. చిత్రంపై నెగిటివ్ టాక్ వినిపించినా వ‌సూళ్లు మాత్రం భారీగానే రాబ‌డుతుంది. వ‌ర్ధ‌మాన రాజ‌కీయ చిత్రం కావ‌డంతో క‌లెక్ష‌న్లు భాగానే చేసింది. ఏరియాల వారిగా చూస్తే క‌లెక్ష‌న్లు ఇలా ఉన్నాయి.

నైజాం 0.39 కోట్లు, సీడెడ్ 0.16 కోట్లు, ఉత్తరాంధ్ర 0.19 కోట్లు, ఈస్ట్ 0.15 కోట్లు, వెస్ట్ 0.11 కోట్లు, కృష్ణా 0.17 కోట్లు, గుంటూరు 0.15 కోట్లు, నెల్లూరు 0.07 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.03 కోట్లు, ఓవర్సీస్ 0.02 కోట్లు, వరల్డ్ వైడ్ టోటల్ 1.44 కోట్లు(షేర్) చొప్పున వ‌సూలు చేసింది. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రానికి 2.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి రోజే ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 1.44 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే 60 శాతం రికవరీ అయిపోయినట్టే..! బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో కోటి వరకూ రాబట్టాలి. అయితే ఈరోజు వెంకీమామ ఎంట్రీ ఇచ్చింది. మరి బ్యాలన్స్ కోటి రాబట్టే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి.

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు.. ఫ‌స్ట్‌డే క‌లెక్ష‌న్ ఎంతో తెలుసా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts