ఆ హీరో అదిరిపోయే స్టెప్పుల‌కు బెదిరిపోతున్న‌ భామ‌..!

December 2, 2019 at 4:14 pm

టాలీవుడ్‌లో ఆ హీరో వేసే స్టెప్ఫుల‌కు హీరోయిన్‌లు, అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతే కాదు ఈ హీరోతో కాలు క‌ద‌పాల‌న్నా హీరోయిన్‌లు ఎంతో చురుకుగా ఉండాల్సిందే. రియాల్టీ షోల్లో కూడా ఈ హీరో స్టెప్పులు వేయాల‌ని ఎందరో కాలు తిక‌మ‌క అయి విరిగిపోయిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ హీరో వేసే స్టెప్పుల‌తో బెంబెలెత్తిపోతుంది ఓ టాలీవుడ్ బామ‌. ఈ టాలీవుడ్ చిన్న‌ది న‌టించింది అతి త‌క్కువ సినిమాల్లోనే.. కానీ ఎంతో పాపుల‌ర్ అయింది మాత్రం ఓ టీవీలో వ‌చ్చిన సీరియ‌ల్‌తో.

ఇప్పుడు అదిరిపోయే స్టెప్పుల‌కు బెదిరిపోతున్న ఈ భామ ఎవ‌రు అనుకుంటున్నారా..? అదే విధంగా స్పెప్పుల‌తో అంద‌రిని అదిరిపోయేలా చేస్తున్న ఈ హీరో ఎవ్వ‌రు అనుకుంటున్నారా..? టాలీవుడ్‌లో మోస్ట్ పాపుల‌ర్ స్టెప్పుల‌తో అద‌ర‌గొడుతున్న హీరో స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌. ఈ హీరో డ్యాన్స్ కు అంత‌లా ఇబ్బంది ప‌డుతున్న హీరోయిన్ ఎవ్వ‌రో కాదు.. అవికా గోర్‌. ఇప్పుడు ఈ అమ్మ‌డు అల్లు అర్జున్ డ్యాన్స్‌పై సంచ‌ల‌న కామెంట్లు చేసింది. ఈ కామెంట్ చూస్తే అంద‌రు షాక్ అవ్వాల్సిందే.

ఇటీవ‌ల ఓ హీరోయిన్ అవికా గోర్‌ను ఓ మీడియా ప‌ర్స‌న్ ఓ ప్ర‌శ్న అడిగాడ‌ట‌. అనుకోకుండా మీకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి డ్యాన్సులు చేసే అవకాశం వస్తే చేస్తారా? అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు అందాల అవికా గోర్ షాక్ తింది. అల్లు అర్జున్ తోనా.. నేనా.. పిచ్చేమైనానా? .. నా కాళ్లు విరగ్గొట్టుకోమంటారా? బన్నితో డ్యాన్సులు చాలా కష్టం!! అంటూ కామెంట్ చేసి సరదాగా నవ్వేసింది. ఇలా అవికా గోర్ చేసిన కామెంట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అవికా గోర్ ఉయ్యాల జంపాల సినిమాతో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాను అందుకుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ఓ సినిమాలో న‌టిస్తున్నది అవికాగోర్‌.

ఆ హీరో అదిరిపోయే స్టెప్పుల‌కు బెదిరిపోతున్న‌ భామ‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts