బాల‌య్య – బోయ‌పాటి క‌థ లీక్… లైన్ ఇదే..!

December 9, 2019 at 1:36 pm

బాల‌కృష్ణ – బోయ‌పాటి కాంబినేష‌న్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ? ప‌్ర‌త్యేకంగా చెప్ప‌క్కర్లేదు. గ‌తంలో వీరి కాంబినేష‌న్లో వ‌చ్చిన సింహా, లెజెండ్ రెండు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఆ రెండు సినిమాల త‌ర్వాత వ‌స్తోన్న మూడో సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంది. మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాకు బాల‌య్య స‌హ నిర్మాత‌గా వ్య‌హ‌రిస్తున్న‌ట్టు భోగ‌ట్టా.

అంటే ఈ సినిమాలో న‌టిస్తున్నందుకు గాను బాల‌య్య రెమ్యున‌రేష‌న్ తీసుకోరు. సినిమా బిజినెస్‌లో ఆయ‌న కొంత అమౌంట్ తీసుకునేలా ఒప్పందం కుదిరింద‌ట‌. ఇక బాల‌య్య‌కు డ్యూయ‌ల్ రోల్స్ కొట్టిన పిండి. బాల‌య్య గ‌తంలో ఎన్నో సినిమాల్లో ఈ డ్యూయ‌ల్ రోల్స్‌లో న‌టించాడు. ఇక బోయ‌పాటితో బాల‌య్య చేసిన సింహా, లెజెండ్ సినిమాల్లోనూ డ్యూయ‌ల్ రోల్సే ఉన్నాయి.

ఇక తాజా సినిమాలో ఉన్న రెండు క్యారెక్ట‌ర్ల‌లో ఒక‌టి రైతు క్యారెక్ట‌ర్ కాగా, మ‌రొక‌టి మిలియ‌నీర్ క్యారెక్ట‌ర్‌. ఈ రైతు క్యారెక్ట‌ర్ చాలా ప‌వ‌ర్‌ఫుల్లుగా ఉంటుంద‌ని స‌మాచారం. ఇక మిలియ‌నీర్ క్యారెక్ట‌ర్ ప్లే బాయ్ రోల్‌లో ఉంటుంద‌ట‌. విజ‌య్ మాల్యా స్టైల్లో ఈ క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని… ఈ క్యారెక్ట‌ర్ అలా ఎందుకు ప్ర‌వ‌ర్తించాల్సి వ‌స్తుంద‌న్న‌దే చివ‌ర్లో ట్విస్ట్ ఉంటుంద‌ని అంటున్నారు.

ఇక సినిమాలో రైతు క్యారెక్ట‌ర్ ఆయువు ప‌ట్టుగా ఉంటుంద‌ట‌. ఈ క్యారెక్ట‌ర్‌లో వ‌చ్చే డైలాగులు, యాక్ష‌న్, ఎమోష‌న్‌, సెంటిమెంట్ అంతా హైలెట్ అవుతుంద‌ట‌. జ‌న‌వ‌రి నుంచి కంటిన్యూగా షూటింగ్ స్టార్ట్ చేసి వ‌చ్చే స‌మ్మ‌ర్‌కు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వ‌చ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

బాల‌య్య – బోయ‌పాటి క‌థ లీక్… లైన్ ఇదే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts