బాల‌య్య రూల‌ర్ ఎవ్వ‌రూ కొన‌ట్లేదా… రైట్స్ ప్రీ.. ప్రీ..!

December 3, 2019 at 10:48 am

కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం ‘రూలర్’. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అవ్వ‌గా ఏ ఏరియా నుంచి కూడా అనుకున్న రేంజ్‌లో రేట్లు ప‌ల‌క‌డం లేద‌ని ట్రేడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

వాస్త‌వంగా చూస్తే రూల‌ర్‌పై ఆడియన్స్ లో మాత్రం పెద్దగా బజ్ లేకుండా పోయింది. ఈ సినిమా టీజ‌ర్ చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా క‌ట్ చేసి వ‌దిలారు. అయితే బాల‌య్య‌ను కొన్ని సంవ‌త్స‌రాలుగా అదే యాక్ష‌న్ షాట్స్‌, డైలాగుల్లో చూసి చూసి ప్రేక్ష‌కులు విసిగిపోయి ఉన్నారు. దీంతో బాల‌య్య‌ను మ‌ళ్లీ అలా చూడ‌డం ప్రేక్ష‌కుల‌కు చాలా బోరింగ్‌గా ఉంది.

బాల‌య్య ఇక నుంచి అయినా ఇలాంటి రొట్ట కొట్టుడు కథలకు బాలయ్య ఇక ఎండింగ్ కార్డు ఇవ్వకపోతే బాల‌య్య సినిమాను కొనే వాళ్లే ఉండ‌రు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు రూల‌ర్‌కు కూడా ఎలాంటి అంచ‌నాలు లేవు. ఈ సినిమాను ఓవ‌ర్సీస్‌లో అస‌లు ఎవ‌రూ కొనేందుకు ముందుకు రాలేద‌ట‌. దీంతో నిర్మాత తానే స్వ‌యంగా ఖ‌ర్చులు పెట్టుకుని డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ప్రీ రైట్స్ ఇచ్చిన‌ట్టు వినికిడి.

సినిమా రిలీజ్ అయ్యి ఏమైనా వ‌సూళ్లు వస్తే తీసుకుంటారు.. లేక‌పోతే లేదు. దీనిని బ‌ట్టి బాల‌య్య మార్కెట్ ఎలా ప‌డిపోతుందో అర్థ‌మవుతోంది. ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

బాల‌య్య రూల‌ర్ ఎవ్వ‌రూ కొన‌ట్లేదా… రైట్స్ ప్రీ.. ప్రీ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts