సంచలనం: షాపింగ్ కాంప్లెక్స్ కానున్న బాలయ్య ఇల్లు..?

December 13, 2019 at 11:47 am

తెలుగుచిత్రసీమలో అగ్రనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ఇంటి గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్..జూబ్లీహిల్స్ చెక్ పోస్టుకు అతి సమీపంలో ఉన్న ఆయన ఇల్లుని కూల్చేసి, ఆ స్థానంలో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టబోతున్నారని తెలుస్తోంది.

బాలకృష్ణ నివాసం….ఇటు ఫిల్మ్ నగర్ వెళ్లే దారిలో అటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వెళ్లే దారిలో నడిబొడ్డున ఉంది. దీంతో ఆయన ఇల్లు నగరంలో పర్యటించే ప్రతిఒక్కరి చూపును ఆకట్టుకునేలా ఉంటుంది. అయితే నడిబొడ్డున ఉండటం వల్ల సహజంగానే కాలుష్యం, శబ్దాలు అధికమే. అయితే దీనికి తోడుగా ఈ దారిలో ఓ ఫ్లై ఓవర్ నిర్మాణం కానుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా బాలయ్య ఇంటిలో కొంత భాగం సదరు విస్తరణకు అందించాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే బాలయ్య ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అసలు విస్తరణ పేరుతో తన ఇంటి స్థలం సమర్పించుకునే బదులుగా తానే ఆ ఇంటిని కూల్చేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా దీనికంటే ముందు బాలయ్య ఆ ఇంటికి పలు వాస్తు మార్పులు చేశారట, అయిన అది అంతగా కలిసి రాలేదంట. ఇదే సమయంలో రోడ్ విస్తరణ అంశం ముందుకు రావడంతో….వారు ఇల్లు కూల్చడంకంటే ముందే తానే ఇల్లు కూల్చేసి… ఏదన్నా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇవ్వాలని బాలయ్య చూస్తున్నారట.

అయితే ఇల్లు కూల్చేశాక అక్కడే జూబ్లీహిల్స్ లో మరో ఇల్లు కట్టుకోవడమా లేక…. ఇప్పుడు సినీ నటులు ఎక్కువ ఉంటున్న మణికొండ వైపు వెళ్లి అక్కడ విశాలమైన గృహం నిర్మించుకుంటారా అనేది తేలాల్సి ఉంది. మొత్తానికైతే బాలయ్య మాత్రం తానే ఇల్లు కూల్చేసి, షాపింగ్ కాంప్లెక్స్ కు ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్లిపోతారని టాక్.

సంచలనం: షాపింగ్ కాంప్లెక్స్ కానున్న బాలయ్య ఇల్లు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts