న‌టికి హీరో ప్ర‌పోజ్‌… పెళ్ల‌య్యింద‌న్న నిజం తెలుసుకుని షాక్‌

December 9, 2019 at 3:54 pm

సినిమా రంగంలో హీరో, హీరోయిన్లకు ఎఫైర్లు కామన్. ఎంతోమంది హీరో, హీరోయిన్లు ఇలా ఎఫైర్లు పెట్టుకుని కొద్దిరోజులపాటు కంటిన్యూ చేసి తర్వాత చాలా సులువుగా బ్రేకప్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఇలా ఉంటే ఓ హీరోయిన్ తో తనకు ఎఫైర్ ఉందని ఓ స్టార్ హీరో ఓపెన్‌గా ప్రకటించి సంచలనం రేపాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 13 టాప్ టీఆర్పి రేటింగ్ లతో దూసుకు పోతుంది. ఈ షోలో బుల్లితెర న‌టులు అర్హాన్ ఖాన్‌, ర‌ష్మీ దేశాయ్ అనే బుల్లితెర న‌టులు కంటెస్టెంట్లుగా న‌టించారు.

వీరు షోల‌కు వ‌చ్చిన కొద్ది రోజుల‌కే బాగా క్లోజ్ అయ్యారు. అర్హాన్‌ ఎలిమినేట్ అయిన రోజు ర‌ష్మీ బాగా ఏడ్చింది. ఆ తర్వాత అర్హాన్‌ను తిరిగి హౌస్ లోకి పంపించారు. అప్పటినుంచి వారిద్దరూ మరింత క్లోజ్ అయిపోయారు. ఈ షోలో అర్హాన్‌ రష్మికి ప్రపోజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే వీరిద్ద‌రి రిలేష‌న్ షిఫ్‌లో బాంబు పేల్చాడు స‌ల్మాన్‌.

స‌ల్మాన్ అర్హాన్‌ను ఉద్దేశించి మీ ఇంట్లో ఎవ‌రెవ‌రు ఉంటార‌ని ప్ర‌శ్నించాడు. అందుకు అర్హాన్ త‌ల్లిదండ్రులు, సిస్ట‌ర్ మాత్ర‌మే ఉంటార‌ని చెప్పాడు. అయితే స‌ల్మాన్ అర్హాన్‌కు భార్య‌, బిడ్డ ఉన్నార‌ని చెప్ప‌డంతో ర‌ష్మీ ఒక్క‌సారిగా ఎమోష‌న‌ల్ అయ్యింది. ఒక్క‌సారిగా ఏడ్చేసింది. త‌న గురించి అన్ని విష‌యాలు అర్హాన్‌కు తెలుసని.. కానీ అర్హాన్ మాత్రం ఇంత పెద్ద విష‌యం త‌న ద‌గ్గ‌ర దాచాడ‌ని చెప్పింది.

ఆమె అలా బిగ్గ‌రగా ఏడ‌స్తూ ఉండ‌డంతో స‌ల్మాన్ స్వ‌యంగా బిగ్‌బాస్ హౌస్ లోప‌ల‌కు వెళ్లి ర‌ష్మిని ఓదార్చాడు. అర్హాన్ మాత్రం త‌న‌కు భార్య‌, బిడ్డ‌తో సంబంధాలు లేవ‌ని.. అవి ఎప్పుడో తెగిపోయాయ‌ని చెప్పాడు. తాను లైఫ్‌లో చాలా ఇబ్బందులు ఫేస్ చేశాన‌ని కూడా చెప్పాడు.

న‌టికి హీరో ప్ర‌పోజ్‌… పెళ్ల‌య్యింద‌న్న నిజం తెలుసుకుని షాక్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts