బ్ర‌హ్మీ పొలిటిక‌ల్ అరంగేట్రం.. త్వ‌ర‌లో బీజేపీ తీర్థం..!

December 2, 2019 at 6:37 pm

ఆయ‌న తెర‌మీద న‌టించ‌కుండానే గిలిగింత‌లు పెట్టేస్తాడు. క‌నిపిస్తూనే న‌వ్వుల మ‌తాబులు పూయిస్తాడు. ఇక‌, న‌టించ‌డం స్టార్ట్ చేస్తే.. న‌వ్వుతో పొట్ట చెక్క‌లు కావాల్సిందే! ఆయ‌నే హాస్య బ్ర‌హ్మ‌.. తెలుగు వారి హాస్య వేల్పు బ్ర‌హ్మానందం. దాదాపు మూడు ద‌శాబ్దాలుగా తెలుగు తెర‌పై కామెడీని పూయిస్తున్న బ్ర‌హ్మీ.. ఇప్పుడు స‌రికొత్త అవ‌తారంతో క‌నిపించ‌బోతున్నార‌నే టాక్ వినిపి స్తోంది. వెండి తెర వేల్పుల‌కు, రాజ‌కీయాల‌కు మ‌ధ్య చాలా ద‌గ్గ‌ర సంబంధ‌మే ఉంది. అనేక మంది నాయ‌కులు, హాస్య‌న‌టులు కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి రాణించారు. హీరోలు, హీరోయిన్లు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి రాణించిన‌ప‌రిస్థితి తెలిసిందే. పొరుగు రాష్ట్రాలు స‌హా ఉమ్మ‌డి ఏపీలో అనేక మంది తెర వేల్పులు… రాజ‌కీయాల్లోనూ రాణించారు.

ఏపీ విష‌యాన్ని తీసుకుంటే.. బ్ర‌హ్మానందం త‌ర్వాత తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై, వీక్ష‌కుల‌కు గిలిగింత‌లు పెట్టిన బాబూ మోహ న్‌.. త‌ర్వాత కాలంలో టీడీపీలో చేరి ఏకంగా మంత్రిగా కార్మిక శాఖ ప‌గ్గాలు చేప‌ట్టారు. త‌న‌దైన శైలిలో రాజ‌కీయాలు చేశారు. త‌ర్వాత టీఆర్ ఎస్‌లోకి చేరారు. ఇక‌, ఇప్పుడు బ్ర‌హ్మానందం కూడా రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో 15 అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను బీజేపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది.

ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి.. అసెంబ్లీలో బ‌ల నిరూప‌ణ చేసుకుంటేనే బీజేపీ స‌ర్కారు కొన‌సాగుతుంది. అలాంటి క్లిష్ట‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ త‌ర‌ఫున బ్ర‌హ్మానందం ప్ర‌చారానికి దిగ‌డం ఆసక్తిగా మారింది. ఏపీ స‌రిహ‌ద్దులోని క‌ర్ణాట‌క నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌బ‌ళ్లాపుర‌లో ఆదివారం బ్ర‌హ్మానందం ప్ర‌చారం చేశారు. అది కూడా బీజేపీ త‌ర‌ఫున ఇక్క‌డ నుంచి ఎన్నిక‌ల్లో పోటీకి దిగిన డాక్ట‌ర్ సుధాక‌ర్ త‌ర‌ఫున బ్ర‌హ్మానందం ప్ర‌చారం చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇక్క‌డ తెలుగు వారు ఎక్కువ‌గా ఉంటారు. పైగా ఇక్క‌డి వారంతా కూడా క‌న్న‌డం బ‌దులు తెలుగులోనే మాట్లాడ‌తారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ ఇక్క‌డ బ్ర‌హ్మానందాన్ని రంగంలోకి దింపిందా? లేక ఆయ‌నే ఇష్ట‌ప‌డి బీజేపీకి ప్ర‌చారం చేశారా? అనేదితెలియాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. మూడు ద‌శాబ్దాలుగా సినీ రంగంలో ఉన్న‌ప్ప‌టికీ ఏ నాడూ రాజ‌కీయాల గురించి కానీ, రాజకీయ నేత‌ల గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడ‌ని బ్ర‌హ్మానందం అనూహ్యంగా బీజేపీ కోసం రోడ్ షోలు చేయ‌డం, ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కు ద‌ణ్నాలు పెట్టి మ‌రీ ఓట్లు వేయ‌మ‌ని కోర‌డం .. వంటి ప‌రిణామాలు ఆస‌క్తిగా మారాయి. మ‌రి త్వ‌ర‌లోనే ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నార‌ని అనే వ్యాఖ్య‌లు నిజ‌మ‌వుతాయేమో చూడాలి.

బ్ర‌హ్మీ పొలిటిక‌ల్ అరంగేట్రం.. త్వ‌ర‌లో బీజేపీ తీర్థం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts