సోలోగా రంగంలోకి దిగిన మెగాస్టార్‌..!

December 2, 2019 at 3:59 pm

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఒంట‌రిగా జీవితాన్ని ప్రారంభించి ఓ సైన్యంను త‌యారు చేసిన మెగాస్టార్ చిరంజీవి.. సామాన్య న‌టుడు నుంచి మెగాస్టార్ గా చిత్ర పరిశ్ర‌మ‌లో ఎదిగిన చిరంజీవి సినిరంగాన్ని త‌న క‌నుసైగ‌తో శాసిస్తున్నాడు. ఏకులా వ‌చ్చి మేకైన చిరంజీవి ఇప్పుడు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఓ దిక్సూచిగా నిలిచాడు. అయితే చిరంజీవికి ఇటీవ‌ల కాలంలో ఓ పెద్ద త‌ల‌నొప్పి ప‌ట్టుకుంది. అదే ఆయ‌న కొడుకు రామ్ చ‌ర‌ణ్‌. మెగాప‌వ‌ర్‌స్టార్‌గా ఎదిగిన రామ్ చ‌ర‌ణ్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు.

రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ ఏర్పాటు చేసి సొంతంగా చిత్రాల‌ను నిర్మిస్తున్నాడు. మెగాస్టార్ రాజ‌కీయాల నుంచి తిరిగి చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌గానే రామ్ చ‌ర‌ణ్ త‌న సొంత నిర్మాణ సంస్థ‌పై ఖైదీ నెంబ‌ర్ 150వ చిత్రం నిర్మించాడు. ఈ చిత్రం భారీ హిట్ అందుకుంది. వెంట‌నే ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా సైరా న‌ర‌సింహారెడ్డి అనే భారీ ప్రాజెక్ట్‌ను చేప‌ట్టాడు రామ్ చ‌ర‌ణ్‌. అయితే ఈ సినిమాతో భారీగానే చేతులు కాల్చుకున్నాడు రామ్ చ‌ర‌ణ్‌. దీనికి తోడు రామ్ చ‌ర‌ణ్ కేరీర్ కూడా ప్ర‌మాద‌క‌రంగా మారింది. దీంతో కొడుకు కేరీర్‌ను, నిర్మాణ రంగంతో చేతులు కాల్చుకుంటున్న తీరును నిశితంగా గ‌మ‌నించిన మెగాస్టార్ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చాడు.

ఇక‌ముందు రామ్ చ‌ర‌ణ్‌ను ప్ర‌తి విష‌యంలో ఇన్‌వాల్వ్ చేయనివ్వకుండా మెగాస్టార్ స్వ‌యంగా రంగంలోకి దిగుతున్నాడు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్క‌బోతున్న త‌రుణంలో మెగాస్టార్ ద‌గ్గ‌రుండి నిర్మాణ వ్య‌యాన్ని, సినిమా విష‌యాల‌ను చూసుకునేందుకు సిద్ద‌మ‌య్యాడ‌ని ఫిలింన‌గ‌ర్‌లో జోరుగా వినిపిస్తుంది. ఇక‌ముందు రామ్‌చ‌ర‌ణ్ త‌న కేరీర్‌ను గాడిలో పెట్టి, ప్రొడ‌క్ష‌న్ కంపెనీని స‌వ్యంగా జ‌రిగేలా చిరునే రంగంలోకి దిగాడ‌ని టాక్‌. ఇంత‌కు ముందు అయితే ఎలా సోలోగా చిత్ర సీమ‌లో ప‌నిచేసే వాడో ఇప్పుడు కూడా సోలోగానే ప‌నిచేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని అందుకు త‌గిన విధంగా ప్ర‌ణాళిక‌తో ముందుకు పోతున్నాడ‌ని జోరుగా చ‌ర్చ‌న‌డుస్తుంది

సోలోగా రంగంలోకి దిగిన మెగాస్టార్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts