బాలీవుడ్ భామ‌తో పంత్ డేటింగ్‌…!

December 13, 2019 at 11:09 am

భారత జట్టు యువ ఆటగాడు, వికెట్ కీపర్ రిషబ్ పంత్ బాలీవుడ్ హాట్ భామతో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ల‌ సమయంలో కూడా వీరిద్దరూ క‌లిసే ఉంటున్నారట. ఇటీవల ముంబైలో జరిగిన మూడు 20- 20 క్రికెట్ మ్యాచ్కు ముందు రోజు పంత్ ఆ హీరోయిన్ తో కలిసి ముంబైలోని ఓ ఖరీదైన హోటల్ లో డిన్నర్ చేయడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్టు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకూ రిషబ్ పంత్ తో డేటింగ్ చేస్తున్నా ఆ బాలీవుడ్ హాట్ భామ ఎవరో కాదు ఊర్వశి రౌతేలా.

గ‌తంలో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యతో ఊర్వశి డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆమె స్పందిస్తూ ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది. ధోనీ వారసుడిగా పేరు తెచ్చుకున్న పంత్‌.. గత కొంత కాలంగా నిలకడలేమి ప్రదర్శన చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పేలవమైన షాట్లతో పెవిలియన్‌కు చేరుతున్నాడు. వెస్టిండిస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పేల‌వ‌మైన షాట్‌తో రెండో బంతికే డ‌క్ అవుట్ అయ్యాడు.

ఇప్ప‌టికే చోటు కోసం అష్ట‌క‌ష్టాలు ప‌డుతోన్న పంత్‌కు మేనేజ్‌మెంట్ అండ‌గా నిలుస్తూ వ‌స్తోంది. మాజీ క్రికెట‌ర్లు కూడా అత‌డు నిల‌దొక్కుకునేందుకు టైం ఇవ్వాల‌ని చెప్ప‌డంతోనే పంత్ ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ట్టులో ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో 18 పరుగులు చేసిన అతడు రెండో టీ20లో 33 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కానీ మూడో టీ20లో ఖాతా తెరవకముందే డగౌట్‌కు చేరుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రేయాయ‌ణంతో వార్త‌ల్లో ఉంటున్నాడు.

బాలీవుడ్ భామ‌తో పంత్ డేటింగ్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts