ఆ ఐదు తీసుకుంటే డ‌యాబెటిస్‌కు చెక్‌..

December 3, 2019 at 10:30 am

డ‌యాబెటిస్ అనే దీర్ఘ‌కాలిక వ్యాధితో ప్ర‌పంచం మొత్తం బాధ‌ప‌డుతోంది. యుక్త వ‌య‌స్సులోనే టైప్‌2 డ‌యాబెటిస్ సంక్ర‌మిస్తుండ‌టంతో ఏం తినాల‌న్నా..తాగ‌ల‌న్నా వారు ఆలోచించాల్సిందే. లేదంటే భారీ మూల్య‌మే చెల్లించుకోవాల్సి వ‌స్తోంది. ముఖ్యంగా డ‌యాబెటిస్‌తో గుండె జ‌బ్బుల సంఖ్య పెరుగుతున్న‌ట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్ర‌తీ ప‌ది మందిలో ఇప్పుడు ఇద్ద‌రు ఈ దీర్ఘ‌కాలిక వ్యాధి బారిన ప‌డుతున్నారు. అందుకే ఈ వ్యాధిపై పూర్తి అవ‌గాహ‌న అవ‌స‌ర‌మ‌ని కేంద్ర ప్ర‌భుత్వం కూడా ప‌లు కార్య‌క్రమాలు చేప‌డుతూ వ‌స్తోంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉండాలంటే ప్ర‌ధానంగా రెగ్యుల‌ర్ వైద్య ప‌రీక్ష‌ల‌తో పాటు ఫ‌లితాల‌కు అనుగుణంగా మందుల వాడ‌కం, వ్యాయామం, మిత‌మైన భోజ‌నం అవ‌స‌ర‌మ‌ని వైద్యులు చెబుతున్నారు.

డయాబెటిస్ ట్రీట్‌మెంట్ తీసుకునేవారికి కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు మేలు చేస్తాయి. వాటితో డయాబెటిస్ పూర్తిగా నయం అయిపోదు. కానీ అవి డయాబెటిస్ లక్షణాల్ని గుర్తించి, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తాయి. ఇందులో దాల్చిన చెక్క‌, మెంతులు, కాక‌ర‌కాయ‌, అల‌వెరా ఎంతో చ‌క్క‌గా షుగ‌ర్ కంట్రోల్‌కు దోహ‌ద‌ప‌డుతాయ‌ని వైద్యులు వెల్ల‌డిస్తున్నారు. చక్కటి సువాసన వచ్చే దాల్చిన చెక్క… కొద్దిగా తియ్యగా కూడా ఉంటుంది. ఇది టైప్ 2 డయాబెటిస్‌ను కంట్రోల్ చేస్తోందని పరిశోధనల్లో తేలింద‌ని చెబుతున్నారు. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచ‌డ‌మే కాకుండా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని సూచిస్తున్నారు. అలాగే కాకర కాయ ఫ్రై, కాకరకాయ కూరలు తింటే ఎంతో మంచిద‌ట‌.

గుజ్జును జ్యూస్‌లా ప‌ర‌గ‌డుపున తాగితే ఇన్సులిన్ ఉత్ప‌త్తి పెంచ‌డ‌మే కాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని తగ్గిస్తుంద‌ని చెబుతున్నారు. టైప్ 2 డయాబెటిస్‌ని కంట్రోల్ చెయ్యాలంటే కాకరకాయ మంచి ఔష‌ధంలా ప‌ని చేస్తుంద‌ని సూచిస్తున్నారు. అద్భుత సుగంధ ద్రవ్యాల్లో మెంతులు ఒకటి. వీటిలో ఫైబర్, కెమికల్స్… పిండి పదార్థాలు, గ్లూకోజ్ వంటివి వేగంగా జీర్ణం అవ్వకుండా చేస్తాయి. మెంతుల్ని నీటిలో నానబెట్టి… ఆ నీరు తాగినా మేలు చేస్తుంద‌ని చెబుతున్నారు. అలాగే కలబందలో పుష్క‌లమైన ఔష‌ధ గుణాలుంటాయి. దీని జ్యూస్‌ను తాగిన డ‌యాబెటిస్ రోగుల‌కు బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. పాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాల్ని బాగుచేసే ప‌నిని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌ర్తిస్తుందంట‌.

ఆ ఐదు తీసుకుంటే డ‌యాబెటిస్‌కు చెక్‌..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts