అలా అయితేనే సంతృప్తితో ఆస్వాదిస్తామంటున్న స్టార్ హీరోయిన్‌..!

December 2, 2019 at 5:01 pm

అమె ద‌క్షిణ భార‌త దేశ సిని ప‌రిశ్ర‌మ‌లో అగ్ర‌నాయిక‌. త‌న న‌ట‌న‌తో ఎంద‌రో అభిమానుల‌ను సంపాదించుకున్న తార‌. మూడు ప‌దుల వ‌య‌స్సు దాటిపోయినా కూడా త‌న న‌ట‌న‌తో ఇంకా ప్రేక్ష‌కుల‌ను రంజింప చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఆ తార చేసిన కామెంట్లు ఇప్పుడు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో హాట్‌టాఫిక్‌గా మారాయి. సంతృప్తి ఎలా చెందాలో.. తాను ఎలా సంతృప్తి చెందుతున్నానో చెప్పింది ఈ తార‌మ‌ణి. ఇంత‌కు ఈ తార ఎవ్వ‌రునుకుంటున్నారా.. అమె మిత్ర‌వింద ఉర‌ఫ్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌.

టాలీవుడ్ లో లక్ష్మీ కళ్యాణం సినిమాతో కథానాయికగా అడుగుపెట్టిన కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. త‌రువాత చందమామతో తొలి హిట్టు అందుకొన్న‌ది. త‌రువాత మగధీరలో మిత్రవిందగా టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా తనకంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న‌ది. మూడు ప‌దుల వ‌య‌స్సు దాటిపోయింది. అయినా ఇప్పటికి ఏమాత్రం అవ‌కాశాలు త‌గ్గ‌కుండా చేతినిండా సినిమాల‌తో ముందుకు సాగుతూనే ఉంది. ద‌క్షిణ భార‌త సిని ప‌రిశ్ర‌మ‌లో అగ్ర కథానాయికగా రాణిస్తున్న కాజల్ అగర్వాల్‌కు కెరీర్ తొలినాళ్లలో తన విమర్శిస్తూ రాసేవాళ్ల అంటే పీకల దాక కోపం ఉండేదట.

తొలినాళ్లలో ఎవరైనా విమర్శిస్తే.. అసలు సహించక పోయేదాన్ని. దాంతో అన్నీ తప్పులే కనిపించేవి. అవే మనసులో పెట్టుకొని పనిచేయడంతో ఆ ప్రభావం చేసే పనిపై స్పష్టంగా కనిపించేది. ఆ తర్వాత ఆ విమర్శను స్వీకరించి.. తనలో ఉన్న లోపాలు గుర్తించగలిగాను. దాంతో రానురాను నా నటనలో మరింత మార్పు కనిపించింది. ఒక్కోసారి మనము మంచిగా పనిచేసినా.. విమర్శించే వాళ్లు ఉంటారు. అలాంటి వాళ్లవల్ల నేను ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేసా. మన పని విషయంలో సంతృప్తిగా ఉండలేం. సంతృప్తి లేకపోతే ప్రయాణాన్ని ఆస్వాదించలేమంటూ చెప్పుకొచ్చింది కాజ‌ల్‌. మన విజయాలను ఆస్వాదించాలంటే సంతృప్తి చెందాల‌ని, అందుకు మ‌నం చేసే ప‌నిపై శ్ర‌ద్ధ ఉండాల‌ని హిత‌బోధ చేస్తుంది ఈ అమ్మ‌డు.

అలా అయితేనే సంతృప్తితో ఆస్వాదిస్తామంటున్న స్టార్ హీరోయిన్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts