నంద‌మూరి హీరోను తొక్కేస్తోందెవ‌రు…!

December 11, 2019 at 11:08 am

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ ప్రారంభం నుంచి పడుతూ లేస్తూ వస్తోంది. కళ్యాణ్ రామ్ కెరీర్ మొత్తం మీద‌ నాలుగైదు చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు కూడా లేవు. కళ్యాణ్ రామ్ కు ఒక్క సూపర్ హిట్ పడితే చాలు… ఆ తర్వాత ఆరేడు సినిమాలు ప్లాప్‌ అవుతున్నాయి. ఈ యేడాది ఆరంభంలో వచ్చిన 118 కళ్యాణ్ రామ్ ఇప్పుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎంత మంచి వాడవురా సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న థియేటర్లలో ఉంది.

ఇప్ప‌టికే మ‌హేష్‌బాబు, అల్లు అర్జున్ సినిమాల‌తో సంక్రాంతి బాక్సాఫీస్ వార్ హీటెక్కింది. ఎంత మంచి వాడవురా సినిమాతో పాటు రజనీకాంత్ – మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న ద‌ర్బార్‌ సినిమా సైతం సంక్రాంతి వస్తోంది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో సినిమాలు కూడా సంక్రాంతికే రిలీజ్ అవుతుండటంతో ఇప్పుడు సంక్రాంతికి కళ్యాణ్ సినిమాకు మహా అయితే మూడు వందలు థియేటర్లు కూడా దొరికే పరిస్థితి లేదని తెలుస్తోంది.

ఇక ఇప్పటికే మహేష్, అల్లు అర్జున్ సినిమాలు ప్రమోషన్స్ లో జోరు చూపిస్తున్నాయి. ఈ విషయంలో కూడా క‌ళ్యాణ్‌రామ్ సినిమా చాలా నీరసంగా ఉంది. ఈ సినిమా నుంచి రీసెంట్‌గా ఒక లిరికల్ సాంగ్ విడుదల చేశారు.. అయితే ఆ పాట ఏంటి.. పాట రిలీజ్ అయిన విషయం చాలా మందికి తెలియ‌దు. ఇక ఈ సినిమాను సంక్రాంతి రేసులో లేకుండా చేసేందుకు… కొంద‌రు కావాల‌నే థియేట‌ర్లు దొర‌క‌కుండా చేసి క‌ళ్యాణ్‌రామ్ సినిమాను తొక్కేస్తున్నార‌ని కూడా ఇండ‌స్ట్రీలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌ట‌కీ అయినా క‌ళ్యాణ్ ఈ సినిమాను జ‌నాల్లోకి తీసుకు వెళ్ల‌క‌పోతే హిట్ అయినా వ‌సూళ్లు రావ‌డం క‌ష్ట‌మే.

నంద‌మూరి హీరోను తొక్కేస్తోందెవ‌రు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts