కొడాలి నాని దెబ్బకి ఆ మంత్రికి మంత్రి పదవి అవుట్

December 3, 2019 at 12:45 pm

వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌న కేబినెట్‌లో శ్రీకాకుళం నుంచి కీల‌క‌మైన ధర్మాన సోద‌రుల్లో పెద్ద‌వాడు, వైఎస్ కు టుంబానికి ఆది నుంచి అండ‌గా ఉన్న ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌కు అవ‌కాశం క‌ల్పించారు. నిజానికి త‌మ్ముడంత దూకుడు లేక పోయినా.. రాజ‌కీయంగా అనుభ‌వం ఉండ‌డం, వివాద ర‌హితుడిగా పేరు ఉండ‌డం కృష్ణ‌దాస్ కు క‌లిసి వ‌చ్చాయి. రాజ‌కీయాల్లో అజాత శ‌తృవుగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. మంత్రి ప‌ద‌వి ఈ కోణంలోనే వ‌రించింద‌నే వ్యాఖ్య‌లు కూడా ఉన్నాయి. అయితే, ఎంత విన‌యం ఉన్నా.. వివాద ర‌హిత‌మైనా.. కూడా స‌మ‌యానికి త‌గిన విధంగా స్పందించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

రాజ‌కీయాల్లో ఇప్పుడున్న ప‌రిస్తితికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించాలి. కానీ, కృష్ణ‌దాసు మాత్రం త‌న ప‌ద్ధ‌తిని ఏ మాత్రం మార్చుకోలేదు. పార్టీ కేడ‌ర్‌ను క‌లుపుకొని పోవ‌డంలోను, మాస్ జ‌నాన్ని పార్టీ వైపు తిప్ప‌డంలో నూ కృష్ణ‌దాసు విఫ‌ల‌మ‌య్యార‌నే వాద‌న ఉంది. అధికారుల‌తోనూ స‌మ‌న్వ‌యం చేయ‌లేక పోతున్నారు. ఇక‌, ఈ జిల్లాలోని కీల‌క మైన టీడీపీ నాయ‌కుడు అచ్చం నాయుడు దూకుడును నిలువ‌రించ‌డంలోనూ దాసు ఫెయి ల‌య్యారు. దీంతో ప్ర‌జ‌లు, మీడియా త‌న‌ను ఇలా అంటున్నార‌ని భావించారో.. ఏమో.. ఇటీ వ‌ల నోరు విప్పిన దాసు.. ఏకంగా బూతుల పంచాగం విప్పేశారు. ఈ ప‌రిణామం మ‌రింత‌గా ఆయ‌న డ్యా మేజీ అయింది.

స‌రే.. తాజా విష‌యానికి వ‌స్తే.. శ్రీకాకుళం ఇంచార్జ్ మంత్రిగా జ‌గ‌న్ మంత్రి కొడాలి నానికి అవ‌కాశం ఇచ్చా రు. నానీ విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న ఫుల్లు ఫైర్ బ్రాండ్‌. ఆయ‌న దూకుడు వేరుగా ఉంటుంద నే విష‌యం తెలిసిందే. జిల్లా ఇంచార్జ్‌గా ఉన్న‌ ఆయన సిక్కోలులో పార్టీని తనదైన శైలిలో పరుగులు పెట్టించాలనుకుంటున్నారు. ఆయన వస్తూనే జిల్లా మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ ని మెతక మంత్రి అని తేల్చేశారు. ఆయన వల్ల పార్టీ గాడిన పడడంలేదని కూడా ఆయన గమనించారు. ఇలా ఉంటే పార్టీ డెవ‌లప్ కావ‌డం క‌ష్ట‌మ‌నే భావ‌న‌ను నాని గుర్తించారు.

ఈ నేప‌థ్యంలోనే స్థానిక ఎన్నిక‌ల‌కు ముందు అంటే ఈ నెల ఆఖ‌రులోగా జిల్లాలోని మంత్రి, ప‌రిస్థితిపై జ‌గ‌న్‌కు నివేదిక ఇస్తార‌ని అంటున్నారు. మ‌రి దీనిని బ‌ట్టి కృష్ణ‌దాస్ ప‌రిస్థితి ఎలా మార‌బోతోందో చూడాలి. కొడాలి నాని దూకుడుతో అటు క్రిష్ట‌దాస్ సైతం టెన్ష‌న్ టెన్ష‌న్‌గానే ఉన్నార‌ని శ్రీకాకుళం వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

కొడాలి నాని దెబ్బకి ఆ మంత్రికి మంత్రి పదవి అవుట్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts