టీడీపీ స్టేజి-2లో ఉంది.. జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌చ్చినా కాపాడ‌లేరు…

December 11, 2019 at 4:09 pm

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఇటీవ‌లికాలంలో త‌రుచూ విరుచుకుప‌డుతున్న కొడాలినాని…ఆ పార్టీ ప‌రిస్థితి ఇక ముగిసిన క‌థేన‌ని తేల్చేశారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ స్వ‌యంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆ పార్టీని ఏమాత్రం చ‌క్క‌దిద్ద‌లేర‌ని అన్నారు. ప్ర‌స్తుతం స్టేజీ-2లో ఉన్న పార్టీ మ‌రికొద్ది రోజుల్లో స్టేజీ 3కి ప‌డిపోతుంద‌ని అప్పుడయితే పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ వ‌చ్చినా పార్టీని ఉనికిలోకి తీసుకురాలేర‌ని అన్నారు. ఇటీవ‌ల ఆయ‌న ఓ ఛాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్ టీడీపీ ప‌గ్గాలు చేప‌డితే మీరు ఆయ‌న‌తో క‌ల‌సి ప‌నిచేయ‌డానికి వెళ్తారా అన్న యాంక‌ర్ ప్ర‌శ్న‌కు త‌న చివ‌రి శ్వాస వ‌ర‌కు వైసీపీలోనే కొన‌సాగుతాన‌ని చెప్పారు. జ‌గ‌న్‌తోనే త‌న రాజ‌కీయ ప్ర‌యాణం ఉంటుంద‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టేశారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌చ్చితంగా త‌న‌కు మంచి మిత్రుడ‌ని, అయితే రాజ‌కీయాల్లో మాత్రం త‌మ బాట‌లు వేర‌ని స్ప‌ష్టం చేశారు. అయితే అదే స‌మ‌యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను రాజ‌కీయంగా చంద్రబాబు వాడుకుని మోసం చేశార‌ని మ‌రో మారు త‌న‌దైన శైలిలో విమ‌ర్శించారు.

తార‌క్ చాలా వ్య‌క్తి అని..అనేక విష‌యాల‌పై మంచి అవ‌గాహ‌న ఉంద‌ని అన్నారు. ఆ స్పార్క్‌ను గ్ర‌హించే చంద్ర‌బాబు 2009 ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్‌ను ప్ర‌చారానికి దింపార‌ని అన్నారు. అనుకున్న‌ట్లుగానే తార‌క్ ప్ర‌చారానికి మంచి స్పంద‌న వ‌చ్చింద‌ని నాని గుర్త చేశారు. ‘‘ 2009లో కాంగ్రెస్, ప్రజారాజ్యం మధ్య ఉన్న పోరు కాస్తా కాంగ్రెస్, టీడీపీ పోరుగా మారడానికి పూర్తి కారణం జూనియర్ ఎన్టీఆరే. అన్ని అంశాలపైనా ఆయనకు ఎంతో అవగాహన ఉంది ’’ అని నాని పేర్కొన్నారు.

అయితే ఎన్టీఆర్‌కు త‌ర్వాత ఏమాత్రం పార్టీలో ప్రాధాన్యం ఇవ్వ‌కుండా అవ‌మానించార‌ని చెప్పుకొచ్చారు. ఇంకో ప‌దేళ్ల‌పాటు వైసీపీకి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఢోకా లేద‌ని,ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల మద్ద‌తు ఉంద‌ని అన్నారు. ప్ర‌జాబ‌లం ఉన్న ప్ర‌భుత్వాల‌కు రెట్టింపు ఉత్సాహం, బాధ్య‌త ఉంటాయ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. అయితే టీడీపీ చ‌వ‌క‌బారు ఆరోప‌ణ‌లు… త‌ప్పుడు ప్ర‌చారాల‌తో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టాల‌ని చూస్తోంద‌ని అన్నారు. ఇవేవీ ప్ర‌జాక్షేత్రంలో చెల్లుబాటు కావ‌ని తేలిపోతోంద‌ని అన్నారు.

టీడీపీ స్టేజి-2లో ఉంది.. జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌చ్చినా కాపాడ‌లేరు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts