లోక్‌స‌భ‌లో దుమ్ము దులిపిన ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుడు… ప్లాస్టిక్‌పై ‘ కోట‌గిరి ‘ ఫైర్‌

December 1, 2019 at 2:20 pm

ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుడిగా ఇప్ప‌టికే గొప్ప పేరు సంపాయించుకున్న ఏలూరు ఎంపీ, వైసీపీ నాయ‌కుడు కోట గిరి శ్రీధ‌ర్ ఇప్పుడు ఇదే అంశంపై కేంద్రాన్ని నేరుగా ప్ర‌శ్నించి అంద‌రి ప్ర‌శంస‌లు సంపాయించుకున్నా రు. కీల‌క మైన స‌మ‌స్య‌ను లేవ‌నెత్తిన శ్రీధ‌ర్ .. కేంద్రం నుంచి స‌మాధానం రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌స్తుతం త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యావ‌ర‌ణం కోసం ఎంతో కృషి చేస్తున్నారు శ్రీధ‌ర్‌. విందు, వినోదాల స‌మయంలో ప్లాస్టిక్ ర‌హిత గ్లాసులు, ప్లేట్లు, చెంచాల వినియోగానికి ఆయ‌న ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్ర మంలోనే నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డ పెళ్లిళ్లు జ‌రిగినా.. ఎలాంటి కార్య‌క్ర‌మాలు జ‌రిగినా.. ప్లాస్టిక్‌ను వినియో గించ‌రాద‌ని చెప్ప‌డ‌మే కాకుండా తాను కూడా స్వ‌యంగా వీటిని ఆచ‌రించి చూపిస్తున్నారు.

అదే స‌మ‌యంలో త‌న‌ను క‌లుసుకునేందుకు వ‌చ్చే అతిథులు, లేక త‌న‌ను అభినందించేందుకు వ‌చ్చే వారు పూల బొకేల స్థానంలో మొక్క‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటాల‌నే సందేశాన్ని శ్రీధ‌ర్ తాను అమ‌లు చేస్తూ. ప్ర‌తి ఒక్క‌రూ పాటించేలా చేస్తున్నారు. ఇప్పుడు దేశం మొత్తానికి సంబం ధించిన కీల‌కమైన ప‌ర్యావ‌ర‌ణ విష‌యాన్ని లోక్‌స‌భ వేదిగా ప్ర‌స్తావించి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించారు. దేశంలో గ‌ణేష్ చ‌తుర్థికి ప్ర‌త్యేక‌త ఉంది. పిల్లా పెద్ద‌ల తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ ఈ పండుగ‌ను ఘ‌నంగా చేసుకుంటారు. నాలుగు రోడ్ల కూడ‌ళ్ల‌లో పెద్ద పెద్ద పందిళ్లు వేసి వినాయ‌క విగ్ర‌హాలు ఏర్పాటు చేసి పూజ‌ల అనంత‌రం వాటిని న‌దుల్లోనో వాగుల్లోనే నిమ‌జ్జ‌నం చేయ‌డం తెలిసిందే.

అయితే, గ‌ణేష్ విగ్ర‌హాల త‌యారీ అనేది దేశంలో పెను ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌స్య‌ను సృస్టిస్తోంది. విగ్ర‌హాల త‌యారీలో సాధార‌ణ మ‌ట్టి స్థానంలో ప్లాస్ట‌ర్ ఆఫ్ ప్యారిస్‌ను వినియోగించ‌డం, మితిమీరిన విధంగా రంగులు వినియోగించ‌డం తిరిగి వాటిని న‌దుల్లోను, కాలువ‌ల్లోనూ నిమ‌జ్జ‌నం చేయ‌డం ద్వారా నీరు క‌లుషితం కావ‌డ‌మే కాకుండా ఆయా న‌దుల్లో జీవించే అనేక జీవ‌జాలానికి, ప‌రోక్షంగా ప‌ర్యావ‌ర‌ణానికి తీవ్ర‌మైన ముప్పు వాటిల్లుతోంది. దీనిని తాజాగా జ‌రుగుతున్న లోక్‌స‌భ స‌మావేశాల్లో శ్రీధ‌ర్ ప్ర‌స్తావించారు. గ‌ణేష్ విగ్ర‌హాల త‌యారీలో ప్లాస్ట‌ర్ ఆఫ్ ప్యారిస్ వినియోగించ‌రాదంటూ 2010లోనే కేంద్రం చ‌ట్టం చేసినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని తెలిపారు.

మ‌ట్టితో విగ్ర‌హాల‌ను త‌యారు చేసేలా ప్రోత్స‌హించాల‌ని ఆయ‌న కేంద్రానికి సూచించారు. అదే స‌మ‌యం లో తొమ్మిదేళ్లు గ‌డిచినా.. ఇప్ప‌టికీ కూడా స‌ద‌రు చ‌ట్టం ఎందుకు అమ‌లు కావ‌డం లేద‌ని, దీనికి కేంద్రం మౌనంగా ఉండ‌డ‌మే కార‌ణ‌మా? అని ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికైనా దీనిని పూర్తిస్థాయిలో అమ‌ల‌య్యేలా, ముఖ్యంగా రాష్ట్రాలు చ‌ర్య‌లు తీసుకునేలా చూడాల‌ని కోరారు. దీనికి కేంద్ర‌మంత్రి జ‌వ‌డేక‌ర్ వెంట‌నే బ‌దులిచ్చారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ప్లాస్ట‌ర్ ఆఫ్ ప్యారిస్ వినియోగం త‌గ్గింద‌ని, ఎక్క‌డైనా స‌మ‌స్య‌లు ఉంటే… త‌మ దృష్టికి తీసుకువ‌స్తే.. ప‌రిష్క‌రిస్తామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. మొత్తంగా ఎంపీ శ్రీధ‌ర్ ప‌ర్యావ‌ర‌ణంపై త‌న ప్రేమ‌ను లోక్‌స‌భ సాక్షిగా నిరూపించుకోవ‌డం గ‌మ‌నార్హం.

లోక్‌స‌భ‌లో దుమ్ము దులిపిన ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుడు… ప్లాస్టిక్‌పై ‘ కోట‌గిరి ‘ ఫైర్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts