ఆ పాట రికార్డులు మోత మోగుతుంది..!

December 3, 2019 at 4:40 pm

ప్రిన్స్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రూ. ఈ చిత్రం సంక్రాంతి బ‌రిలో ఉంది. 2020 జ‌న‌వ‌రి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది. అయితే ఈ చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మం జోరు పెంచారు చిత్ర యూనిట్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా ప్ర‌మోష‌న్ పెద్ద ఎత్తున చేపట్ట‌క పోవ‌డంతో మ‌హేష్‌బాబు అభిమానులు నిరుత్సాహంగా ఉన్నారు. అయితే ఇక సినిమా విడుద‌ల‌కు నెల రోజులే స‌మ‌యం ఉన్నందున చిత్ర యూనిట్ ఇక ప్ర‌మోష‌న్ లో దూసుకు పోతుంది.

ఈ సినిమాతో పాటు సంక్రాంతి బ‌రిలో పోటీగా ఉన్న మ‌రో స్టార్ హీరో అల్లు అర్జున్ సినిమా అలా వైకుంఠ‌పుర‌ములో సినిమా ప్ర‌మోష‌న్ జోరుగా సాగుతుంది. గ‌త రెండు నెల‌ల నుంచి బ‌న్నీ త‌న సినిమా ప్ర‌మోష‌న్‌ను అంద‌నంత ఎత్తుకు తీసుకుపోతున్నాడు. అయితే ప్ర‌మోష‌న్ విష‌యంలో వెనుక‌ప‌డ్డ మ‌హేష్‌బాబు సోమ‌వారం ఓ పాట‌ను విడుద‌ల చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు సరిలేరు నీకెవ్వరు టీజర్ తో ఫ్యాన్ ని ఊపేసిన మహేష్ నిన్న మొదటి సాంగ్ విడుదల చేసి అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లారు.

మాస్ ఐటమ్ బీట్స్ కి పెట్టింది పేరైన దేవిశ్రీ అందించిన మైండ్ బ్లాక్ సాంగ్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. సంక్రాంతి కి వెండి తెరపై ఈ సాంగ్ పటాసులా పేలడం ఖాయంగా కనిపిస్తుంది. బ్లేజ్ మరియు రనీనా రెడ్డి పాడగా శ్రీమణి, దేవీశ్రీ సాహిత్యం అందించారు. ఇక ఈ సాంగ్ ఇప్పటికే 5మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ దాటివేసింది. విడుదలై ఇరవై నాలుగు గంటలు కూడా ముగియక ముందే ఇన్ని వ్యూస్ దక్కించు కోవడం రికార్డ్ గా మారింది. సినిమా విడుదలకు ముందే టీజర్ మరియు సాంగ్స్ తో మహేష్ రికార్డుల వేట మెదలెట్టారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక లేడీ సూప‌ర్‌స్టార్ విజ‌య‌శాంతి ప్రత్యేక పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఆ పాట రికార్డులు మోత మోగుతుంది..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts