2020 అంతా మెగా సంద‌డే..!

December 3, 2019 at 10:03 am

2019కి ముగిసేందుకు రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయి.. 2020 వ‌చ్చేందుకు చ‌క చ‌కా అడుగులు ముందుకు ప‌డుతున్నాయి.. అయితే 2019 లో చిత్ర ప‌రిశ్ర‌మలో రాజ్య‌మేలింది మెగా కుటుంబ‌మే.. రాబోవు 2020లోనూ రాజ్య‌మేల బోయేది కూడా మెగా కుటుంబ‌మే అనే సందేహం ఏమీ లేదు. ఎందుకంటే వ‌రుస సినిమాల‌తో మెగా కుటుంబ హీరోలు జోరు మీదున్నారు. ఇప్ప‌టికే ఈ ఏడాది చివ‌రి ద‌శ‌లో ఉన్న‌ప్ప‌టి కూడా మ‌రో మెగా హీరో ఈ నెల‌లో సంద‌డి చేసేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ మెగా హీరో సంద‌డి పూర్తి అయిపోగానే.. వ‌చ్చే ఏడాదికి స్వాగ‌తం పలుకుతూ మ‌రో మెగా హీరో చిత్ర ప‌రిశ్ర‌మ‌ను షేక్ చేయ‌నున్నాడు.

రాబోవు ఏడాది అంతా మెగా సంద‌డి ఉండ‌బోతుంద‌నే సంకేతాలు ఉన్నాయి. ఇప్ప‌టికే చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మెగా హీరోలు త‌మ సినిమాల‌ను ప‌ట్టాల మీద ఉంచారు. ఇంకా ప‌ట్టాలెక్క‌ని సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఓసారి మెగా సినిమా సంద‌డి గురించి పరిశీలిస్తే.. మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టించిన చిత్రం ప్రతిరోజు పండుగే. ఈనెల 20న ప్రతి రోజు పండగే రిలీజ్ కానుంది. ఈ సినిమాను మారుతి ద‌ర్శ‌క‌త్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ సంద‌డి అయిపోగానే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్‌. ఈ సినిమా పాన్ ఇండియాగా తెర‌కెక్కుతుంది. ఈ సినిమా జూలై మాసంలో విడుద‌ల కానున్న‌ది. ఇలా ఈ సినిమాలు సంద‌డి చేస్తుండ‌గానే అల్లు అర్జున్ నిర్మాత‌గా 2020లో సాయి తేజ్ హీరోగానే మరో సినిమాని నిర్మించనున్నామని ప్రకటించారు. దాంతో పాటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగాను ఒక సినిమాని నిర్మిస్తామని తెలిపారు. గీతా అధినేతకు వరుణ్ తేజ్ తో ఇదే మొదటి సినిమా. కొత్త సంవత్సరంలో అధికారికంగా ప్రకటించబోతున్నారట. దీనికి తోడు మెగాస్టార్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రాబోతున్న చిత్రం కూడా 2020లో ఉండ‌బోతుంద‌నేది టాక్‌. దీన్ని బట్టి చూస్తే మెగా హీరోలకు అల్లు అరవింద్ 2020లో కొత్త సంవత్సర కానుకల్ని అందిస్తున్నారని తెలుస్తోంది. ట్వీస్ట్ ఏంటంటే.. అల్లు అరవింద్ మెగాస్టార్ తోను ఒక సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని ఆ విషయం కూడా 2020 లో వెల్లడిస్తారని మరో ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. సో మెగా కుటుంబ చిత్రాలు 2020లో అనేకం రాబోతున్నాయి.

2020 అంతా మెగా సంద‌డే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts