నాగబాబుకు హైపర్ ఆది జబర్దస్త్ పంచ్!

December 9, 2019 at 5:17 pm

మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ వదిలి వెళ్ళిన దగ్గర నుంచి….ఆ షో రూపు రేఖలే మారిపోయాయి. కొత్త కొత్త టీంలు, కొత్త జడ్జీలు షోలో సందడి చేస్తున్నారు. అలాగే పంచులు కూడా సరికొత్తగానే పడుతున్నాయి. అది కూడా షో వదిలి వెళ్ళిన నాగబాబు టార్గెట్ గా ఎక్కువ పంచులు పేలుతున్నట్లు కనబడుతున్నాయి. అంతర్గత కారణాలతో షో నుంచి బయటకు వెళ్ళిపోయిన నాగబాబు…వేరే చానల్ షోలో ప్రత్యక్ష ప్రసారమయ్యారు. ఇక ఆ షో వేదికగా నాగబాబు జబర్దస్త్ పై ఫుల్ సెటైర్లు వేశారు.

తాజాగా ‘అదిరింది’ అనే షో ప్రోమో రిలీజ్ అయింది. ఈ షోలో రోజా, అలీలపై సెటైర్లు వేస్తూ నాగబాబు ఎంట్రన్స్ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో నాగబాబుకు కౌంటర్లు పడ్డాయి. తన స్కిట్‌లో భాగంగా ‘ కంటెస్టంట్ అరేయ్ మనం ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలిరా అంటే వెంటనే హైపర్ ఆది అదిరిపోయే సెటైర్ వేసాడు. ఏడేళ్లుగా కలిసిన వారి విడిపోతున్నారు మూడేళ్లది బొక్క.. మన రిలేషన్ ఎంత అంటూ అదిరిపోయే పంచ్ విసిరాడు.

ఇక చలాకి చంటి కూడా నాగబాబుపై అదిరిపోయే సెటైర్లు వేశాడు. ఇక్కడ వేరే రాజు ఉండాలి కదా అంటూ ఒక కంటెస్టెంట్ అడిగితే ఆయనకు ఇక్కడ భోజన వసతులు బాగోలేవని వేరే రాజ్యానికి వెళ్ళిపోయాడు.. వెళుతూ వెళుతూ మాకు ఈ రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళాడు అంటూ ఓ సెటైర్ పేల్చాడు. మొత్తానికి నాగబాబు ఉన్నప్పుడూ ఆయన చుట్టూ భజన చేసిన వారంతా…ఇప్పుడు ఆయన టార్గెట్ గా పంచులు పేలుస్తున్నారు. అయితే అటు నాగబాబు వేరే షో ద్వారా జబర్దస్త్ పై పంచులు వేయడంతోనే, ఇప్పుడు జబర్దస్త్ టీం నాగబాబుకు కౌంటర్లు ఇస్తున్నారు.

నాగబాబుకు హైపర్ ఆది జబర్దస్త్ పంచ్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts